'రవితేజ గొడ్డుచాకిరీ చేస్తాడు'అంటున్న బ్రహ్మానందం
'రవితేజ గొడ్డుచాకిరీ చేస్తాడు.'వీర' సినిమాలో రవితేజ కామెడీ, యాక్షన్ రెండూ చేశాడు. దర్శకుడు రమేష్‌వర్మ నటీనటులనుంచి తను అనుకుంది రాబట్టుకున్నాడు' అని బ్రహ్మానందం అన్నారు.రవితేజ హీరోగా కాజల్ అగర్వాల్, తాప్సీ హీరోయిన్లుగా శాన్వి ప్రొడక్షన్స్ పతాకంపై గణేశ్ ఇందుకూరి నిర్మించిన 'వీర' చిత్రం క్రిందటి శుక్రవారం విడుదలైంది. రమేశ్‌వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఆడియో ట్రిపుల్ ప్లాటినమ్ డిస్క్ వేడుక బుధవారం సాయంత్రం ఓ ప్రైవేట్ హోటల్‌లో జరిగింది.ఈ సందర్బంగా ఇలా బ్రహ్మానందం స్పందించారు.
అనంతరం రవితేజ మాట్లాడుతూ.. బ్రహ్మానందంగారితో, మేం చేసిన కామెడీ బాగా క్లిక్ అయింది. మంచి టైమింగ్ పంచ్ ఉన్న సన్నివేశాలు చేసాం. అలాగే నేను, ఆలీ 'డాన్‌శీను'లో ఫుల్‌లెంగ్త్ రోల్ వేశాం. మళ్లీ ఈ సినిమాలో కుదిరింది. సంగీత దర్శకుడు తమన్ చక్కటి బాణీలు ఇచ్చాడు. పనిచేసిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అని తెలిపారు. సంగీత దర్శకుడు తమన్ మాట్లాడుతూ... కిక్ సినిమా నుంచి రవితేజకు నాలుగు సినిమాలు చేశాను.
ఆయన బాడీ లాంగ్వేజ్‌కు సరిపడా సంగీతాన్ని అందించాను అని అన్నారు.ఈ కార్యక్రమంలో దర్శకుడు రమేశ్‌వర్మ, నటీనటులు శ్రీదేవి, బ్రహ్మానందం, అలీ, సునీల్, సినిమాటోగ్రాఫర్ ఛోటా కె. నాయుడు, సంగీత దర్శకుడు తమన్, ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ భగవాన్‌రాజు, ఆదిత్య దయానంద్ తదితరులు పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications











