»   » ‘మా’ ముద్దుతో శుభాకాంక్షలు (బ్రహ్మానందం బర్త్ డే స్పెషల్)

‘మా’ ముద్దుతో శుభాకాంక్షలు (బ్రహ్మానందం బర్త్ డే స్పెషల్)

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    హైదరాబాద్: టాలీవుడ్ నవ్వుల డాన్, ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం పుట్టినరోజు నేడు. నేటితో బ్రహ్మానందం 60 వసంతాలు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్' అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ తో పాటు శివాజీ రాజా తదితరులు ఆయన నివాసానికి చేరుకుని అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్....బ్రహ్మానందానికి ముద్దు పెట్టిమరీ విష్ చేయడం గమనార్హం.

    బ్రహ్మానందం పూర్తి పేరు కన్నెగంటి బ్రహ్మానందం. ఫిబ్రవరి 1, 1956న గుంటూరు జిల్లా సత్తెనపల్లి తాలూకా ముప్పాళ్లలో జన్మించారు. తండ్రి కన్నెగంటి నాగలింగాచారి మరియు తల్లి పేరు కన్నెగంటి లక్ష్మీనరసమ్మ. అత్తిలిలో లెక్చరర్‌గా కెరీర్ ప్రారంభించిన బ్రహ్మానందం నిజ జీవితంలోని వ్యక్తులను అనుకరుణ చేస్తూ అందరి ప్రశంసలూ పొందేవారు. 1985లో దూరదర్శన్లో వచ్చిన 'పకపకలు' కార్యక్రమాన్ని సమర్ధంగా నిర్వహించగా మంచి స్పందన వచ్చింది. బ్రహ్మానందంను మొట్టమొదటి సారిగా మూవీ కెమెరా ముందు మేకప్ వేసి నిలబెట్టినవారు దర్శకులు వేజళ్ల సత్యనారాయణ. నరేశ్ కథానాయకుడిగా నటించిన 'శ్రీ తాతావతారం' అనే చిత్రంలో కథానాయకుడి నలుగురు స్నేహితులలో ఒకడిగా నటించారు. విశేషం ఏమిటంటే తన పుట్టినరోజు ఫిబ్రవరి 1వ తేదీన ఆ సినిమాలో తొలి వేషం వేశాడు. 1985లో హైదరాబాద్ వెస్లీ కాలేజ్‌లో మధ్యాహ్నం పన్నెండు గంటలకు హీరో నరేశ్‌తో తీసిన తొలి షాట్ బ్రహ్మానందం నటజీవితానికి శ్రీకారం చుట్టింది.

    ఈ చిత్రంతో నటించడం ప్రారంభించినా తొలిసారి విడుదలన చిత్రం మాత్రం జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన "సత్యాగ్రహం". బ్రహ్మానందాని బాగా గుర్తింపు తెచ్చిన తొలి పాత్ర 'అహనా పెళ్లంట' చిత్రంలో అరగుండు పాత్ర. "...పాడె మీద పైసలు ఏరుకొనే వెధవా... పోతావ్‌రా రేయ్... నాశనమై పోతావ్..." అంటూ యజమాని పీనాసితనాన్ని బాహాటంగా కక్కలేక తనలోనే అగ్గిబుగ్గైపోతూ ఆక్రోశాన్ని దిగమింగుకొనే అహ! నా పెళ్ళంట! లోని అరగుండు పాత్రతో తెలుగు ప్రేక్షకుల దృష్టి అతనిపై పడింది. అప్పటి నుంచి ఇంతింతై వటుడింతై అన్నట్లు స్టార్ కమెడియన్ గా ఎదిగారు. ఈ తరం కమెడియన్లతో కూడా ఆయన పోటీ పడుతూ అగ్ర స్థానంలో నిలిచారంటే ఆయన ప్రత్యేకత ఏమిటో అర్థం చేసుకోవచ్చు.

    కామెడీ డాన్

    కామెడీ డాన్

    తెలుగు సినీ శ్రమలో కామెడీ డాన్‌ ఎవరంటే ముందుగా గుర్తొచ్చేది బ్రహ్మానందం పేరు.

    వివిధ పాత్రలు

    వివిధ పాత్రలు

    అరగుండుగా, ఖాన్ దాదాగా, కత్తి రాందాసుగా, శంకర్‌దాదా ఆర్.ఎమ్.పి.గా... వైవిధ్యమైన పాత్రల పేర్లతో పేరుగాంచిన నటుడు. బ్రహ్మానందం గురించి ఎంత చెప్పిన తక్కువే.

    గిన్నిస్ రికార్డు

    గిన్నిస్ రికార్డు

    ప్రతి సినిమాలోనూ ప్రేక్షకులను నవ్విస్తూ...హాస్యానికి కొత్త ఒరవడితో కేవలం హావభావాతో ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టేవాడు. అత్యధిక చిత్రాలలో నటించిన నటుడిగా గిన్నిస్‌బుక్‌ రికార్డును సైతం అందుకున్న బ్రహ్మి కేంద్ర ప్రభుత్వంచే పద్మశ్రీ అవార్డును సైతం అందుకున్నారు అందుకున్నారు.

    1000 సినిమాల రికార్డ్

    1000 సినిమాల రికార్డ్

    1000 సినిమాల రికార్డును బ్రేక్ చేసారు. దాసరి దర్శకత్వంలో వచ్చిన ‘ఎర్ర బస్సు' చిత్రంతోనే ఆయన ఈ మైలురాయిని దాటారు.

    English summary
    Brahmanandam turns 60 today. Brahmanandam Kanneganti, is an Indian film actor and comedian known for his works predominantly in Telugu cinema. He currently holds the Guinness World Record for the most screen credits for a living actor.He acted in around 1000 films.
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more