బ్రహ్మానందం సరికొత్త అవతారం...రాప్ స్టార్
హైదరాబాద్: టాలీవుడ్ నవ్వుల డాన్ బ్రహ్మానందం సరికొత్త అవతారంలో కనిపించబోతున్నారు. రాప్ మ్యూజిక్ స్టార్‌గా దర్శనమివ్వబోతున్నాడు. 'గీతాంజలి' సినిమా ప్రమోషన్ సాంగులో బ్రహ్మీ ఈ సరికొత్త లుక్‌లోకి మారబోతున్నాడు. ఈ పాటను ప్రముఖ రాపర్, పాప్ సింగర్ బాబా సెహగల్ పాడబోతున్నారు.
'గీతాంజలి' సినిమా విషయానికొస్తే....అంజలి కధానాయికగా తెలుగులో 'గీతాంజలి' చిత్రాన్ని తెరకెక్కుతోంది. హర్రర్, హాస్య కధాంశంగా రూపొందుతున్న ఈ చిత్రానికి నూతన దర్శకుడు రాజ్ కిరణ్ దర్శకత్వం వహిస్తుండగా, ఎంవివి సత్యనారాయణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. చిత్ర కథను ప్రముఖ రచయిత కోన వెంకట్ సమకూర్చారు.

ప్రవీణ్ లక్కరాజు సంగీత దర్శకుడిగా, శ్రీజో గేయ రచయితగా పరిచయమవుతున్నారు. దర్శకుడు వి.వి. వినాయక్ వాయిస్ ఓవర్‌తో ఈ సినిమా మొదలవుతుంది. ఇప్పటివరకు కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేసిన శ్రీనివాసరెడ్డి ఈ చిత్రానికి మూల స్తంభం వంటి ప్రధాన పాత్ర చేశాడు. సత్యం రాజేశ్ ఓ కీలక పాత్ర చేశాడు.
జూలై రెండో వారంలో పాటల్నీ, ఆగస్ట్ మొదటి వారంలో సినిమానీ విడుదల చేయబోతున్నారు. శ్రీనివాసరెడ్డి, సత్యం రాజేష్, హర్ష వర్దన్ రాణె, రావు రమేశ్, అలీ, రఘుబాబు, పృథ్వీ, ఝాన్సీ, వెన్నెల కిశోర్, శ్రవణ్, మధునందన్, సీవీఎల్ నరసింహారావు, దీక్షితులు తారాగణమైన ఈ చిత్రానికి రచనా సహకారం: అనిల్ రావిపూడి, వెంకటేశ్ కిలారు, కథా విస్తరణ, స్క్రీన్‌ప్లే, మాటలు: కోన వెంకట్, సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్, సహ నిర్మాత: వి.ఎస్.ఎన్. కుమార్ చీమల.


Click it and Unblock the Notifications











