బ్రహ్మానందం వికృత చేష్టలపై వేటుకి రెడీ
తెలుగునాట ప్రముఖ కమిడియన్ గా వెలుగొందుతున్న బ్రహ్మానందంపై వేటు వేయటానికి ఆంధ్రప్రదేశ్ నిర్మాతల మండలి నిర్ణయించుకుంది. ఈ మేరకు ఈ రోజు (ఏప్రియల్ 22న) సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. తెరపై నవ్వించే బ్రహ్మానందం తన అన్ ప్రొపిషనల్ ఏటిట్యూడ్ తో నిర్మాతలను బాగా ఏడిపిస్తూంటారు. ఓహ్రి రెస్టారెంట్ నుంచి రోజూ తన కుటుంబం మొత్తానికి ఫుడ్ పార్శిల్ తెప్పించుకుని ఆ బిల్లను నిర్మాతకు ఇస్తూంటారు. అలాగే కంపెనీ వెహికల్ లో వచ్చి వెహికల్ కన్వీయన్స్ ని నిర్మాతకు పంపి డబ్బు వసూలు చేస్తూంటారు. అలా రకరకాలుగా డబ్బుని పిండి వసూలు చేస్తూంటారు. దర్శకుడు కొత్త వాడు అయితే అతని మాట అస్సలు వినకుండా కామెంట్స్ చేస్తూంటారు. తోటి ఆర్టిస్టులను రకరకాలుగా ఇబ్బంది పెడుతూంటారు. అయితే బ్రహ్మానందంకు స్టార్ వ్యాల్యూ ఉండటంతో నిర్మాతలు అతన్ని తప్పని సరిగా భరిస్తూ వచ్చారు. ఇప్పుడు అతనిపై వేటు వేయాలని ఈ సమావేశంలో నిర్ణయించుకున్నారు.


Click it and Unblock the Notifications











