ఇద్దరమ్మాయిల మధ్య బ్రహ్మీ... నవ్వులేనవ్వులు(ఫోటో)

By Bojja Kumar

హైదరాబాద్: టాలీవుడ్ నవ్వుల రారాజు బ్రహ్మానందం మరోసారి తనదైన రీతితో ప్రేక్షకుల ముఖాల్లో నవ్వుల జల్లు కురిపించడానికి సిద్ధం అవుతున్నాడు. ప్రస్తుతం అల్లు అర్జున్-పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందుతున్న 'ఇద్దరమ్మాయిలతో' చిత్రంలో బ్రహ్మానందం నటిస్తున్నాడు.

ఈ చిత్రానికి సంబంధించిన ఫోటో ఒకటి ఇప్పుడు నెట్లో హల్ చల్ చస్తోంది. ఇద్దరమ్మాయిలతో బ్రహ్మానందం ఉండటంతో.....హీరోను ఇమిటేట్ చేస్తూ బ్రహ్మీ క్యారెక్టర్ ఉంటుందని భావిస్తున్నారు. మరో వైపు ఈ సినిమా సినిమాలో అచ్చమైన తెలుగు వాడిలా పంచె కట్టుకొని అందరిని అలరించనున్నాడు.

అయితే, బ్రహ్మానందం ఇలా హుందాగా వున్నాడు కదా అని చెప్పి, కామెడీ చేయకుండా జంటిల్మెన్ లా వుంటాడంటే నమ్మడానికి మనమేమీ అమాయకులం కాదు కదా... ఆ వేషంలోనే కావలసినంత కామెడీ గుమ్మరిస్తాడు. కనికట్టు చేసి మనల్ని నవ్వుల్లో ముంచెత్తుతూ చక్కిలిగింతలు పెడతాడు.

ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన అమలాపాల్‌, కేథరీన్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: శ్యామ్‌.కె.నాయుడు, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, నృత్యాలు: దినేష్‌, కళ: చిన్నా, కూర్పు: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌. కో-రైటర్స్: బి.వి.ఎస్. రవి, కళ్యాణ్‌ వర్మ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X