Brahmanandam Son: ఘనంగా బ్రహ్మానందం రెండో కుమారుడి నిశ్చితార్థం.. వధువు ఎవరంటే?

తెలుగు అగ్ర హాస్యనటుడు బ్రహ్మానందం గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కమెడియన్ గా ఆయనకు ఉన్న పేరు ఎవరు భర్తీ చేయలేరు. తనదైన హాస్యంతో యావత్ తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. ఇటీవల కాలంలో రంగమార్తాండ వంటి సినిమాల్లో సీరియస్ పాత్రలు కూడా చేస్తూ అందులోనూ మెప్పు పొందారు. అయితే బ్రహ్మానందం ఇంట్లో త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఆయన రెండో కుమారుడు సిద్ధార్థ్ పెళ్లి పీటలు ఎక్కినున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..

తెలుగు ప్రేక్షకులను ఎంతగానో నవ్వించారు హాస్య నటులు బ్రహ్మానందం. వేల చిత్రాల్లో నటించి భవిష్యత్తులో చెరగని హాస్యాన్ని పండించారు. సినిమాల తర్వాత మొన్నటి వరకు చాలా గ్యాప్ తీసుకున్న ఆయన హాస్యం సోషల్ మీడియాలో మీమ్స్ తో నిత్యం ఎంటర్టైన్ చేసింది. ఇటీవల వాంటెడ్ పండుగాడ్, పంచతంత్ర వంటి చిత్రాల్లో దర్శనం ఇచ్చిన బ్రహ్మానందం.. రంగమార్తాండ మూవీలో మాత్రం సీరియస్ పాత్ర చేసి ప్రేక్షకుల చేత కన్నీళ్లు పెట్టించారు.

Brahmanandam Younger Son Siddharth Engagement With Dr Aishwarya

ఇక బ్రహ్మానందంకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు గౌతమ్ సినీ పరిశ్రమలోకి హీరోగా అడుగుపెట్టిన విషయం తెలిసిందే. పల్లకిలో పెళ్లి కూతురు సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న గౌతమ్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. బాసంతి, చారుశీల, మను వంటి చిత్రాల్లో నటించిన గౌతమ్ కు హీరోగా అంతగా గుర్తింపు దక్కలేదు. ఇదిలా ఉంటే బ్రహ్మాందం రెండో కుమారుడు సిద్ధార్థ్. అతను త్వరలో పెళ్లి కొడుకు కాబోతున్నాడు. డాక్టర్ పద్మజ వినయ్ కుమార్తె.. డాక్టర్ ఐశ్వర్యతో సిద్ధార్థ్ పెళ్లి జరగనుంది.

తాజాగా సిద్ధార్థ్ నిశ్చితార్థపు వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రస్తుతం వీరికి సంబంధించిన ఎంగేజ్ మెంట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వేడుకల్లో కమెడియన్ అలీ, రాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త సుబ్బిరామిరెడ్డితోపాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. నూతన జంటను ఆశీర్వదించారు. అయితే వీరి పెళ్లి తేదీ, వేదిక ఎక్కడనే వివరాలు ఇంకా తెలియరాలేదు. కానీ పెళ్లి వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ఇప్పటికే మొదలు పెట్టినట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X