చెల్లి పంపిన గిఫ్ట్‌తో కన్నీరు పెట్టుకున్న ఎన్టీఆర్.. బాలయ్య తరువాత బ్రాహ్మణి కూడా!
Recommended Video

చాలా కాలం తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలయ్య ఒకే వేదికపై కనిపించడంతో నందమూరి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. అరవింద సమేత విజయోత్సవ వేడుకకు బాలకృష్ణ ముఖ్య అతిధిగా హాజరైన సంగతి తెలిసిందే. బాలకృష్ణ, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఒకే వేదికపై కనిపించడంతో ఈవెంట్ మొత్తం ఉత్సాహభరితంగా సాగింది. చాలా కాలం తరువాత బాలయ్య, ఎన్టీఆర్ మధ్య ఆప్యాయతానురాగాలు చూసి ఫ్యాన్స్ మురిసిపోయారు. తాజగా మరో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.

బాబాయ్ పక్కనే
అరవింద సమేత సక్సెస్ మీట్ లో బాలయ్య ప్రసంగిస్తున్నంత సేపు ఎన్టీఆర్ పక్కనే నిలబడి కనిపించాడు. తాను, జూ. ఎన్టీఆర్ చేసే చిత్రాలు మరెవరికీ సాధ్యం కావని బాలయ్య అభిమానులని ఉత్సాహపరిచారు. అరవింద సమేత చిత్రంలో డైలాగ్ చెప్పి బాలయ్య అలరించాడు. పాలిచ్చే తల్లులకు పాలించడం ఒక లెక్కా అనే డైలాగ్ బాలయ్య చెప్పాడు.

రెండు సినిమాలు
తన లెజెండ్ మూవీ, అరవింద సమేత చిత్రాల్లో ఆడవాళ్ళ ప్రాముఖ్యతని తెలియజేశాం అని బాలయ్య తెలిపాడు. ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంతో బిజీగా ఉండడం వలన తాను ఇంకా అరవింద సమేత చిత్రం చూడలేదని బాలయ్య తెలిపాడు. వీలు చూసుకుని త్వరలోనే చూస్తానని తెలిపాడు.

ఎన్టీఆర్‌కు చెల్లెలి గిఫ్ట్
బాబాయ్ తన చిత్ర విజయోత్సవవేడుకకు హాజరు కావడంతో సంతోషంగా ఉన్న ఎన్టీఆర్ కు మరో గిఫ్ట్ అందింది. నారా బ్రాహ్మణి ఎన్టీఆర్ కు స్వయంగా ఓ గిఫ్ట్ పంపినట్లు తెలుస్తోంది. ఆ గిఫ్ట్ చూసి ఎన్టీఆర్ భావిద్వేగానికి గురయ్యాడట. ఇటీవల నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంగతి తెలిసిందే.

హరికృష్ణ మధుర జ్ఞాపకాలు
నందమూరి హరికృష్ణ మధుర జ్ఞాపాలకు సంబందించిన ఫొటోలన్నింటితో ఆల్బమ్ రూపొందించిన బ్రాహ్మిణి దానిని ఎన్టీఆర్ కు గిఫ్ట్ గా పంపిందట. చెల్లెలు పంపిన గిఫ్ట్ తో ఎన్టీఆర్ భావోద్వాగానికి గురై బ్రాహ్మిణికి తిరిగి కృతజ్ఞతలు తెలిపినట్లు తెలుస్తోంది.

దూసుకుపోతున్న అరవింద సమేత
ఇదిలా ఉండగా అరవింద సమేత చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఇప్పటికీ ఈ చిత్రం అద్భుతమైన వసూళ్లు సాధిస్తుండడం విశేషం. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శత్వంలో ఫ్యాక్షన్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. జగపతి బాబు మరోమారు విలన్ పాత్రలో అదరగొట్టాడు


Click it and Unblock the Notifications











