Brahmastra pre-release event జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్​కు నిరాశ.. ఆ ఈవెంట్​ రద్దు.. అంతలోనే మళ్లీ..

బాలీవుడ్ స్టార్ హీరో రణ్​బీర్ కపూర్, ఆలియా భట్ నటించిన చిత్రం బ్రహ్మాస్త్రం. సెప్టెంబర్​ 9న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్​గా రిలీజ్​ కానుంది. ఈ చిత్రానికి దక్షిణాదిలో దర్శకధీరుడు రాజమౌళి.. సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం సాయంత్రం చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్​ను హైదరాబాద్​లోని రామోజీ ఫిలిం సిటీలో నిర్వహించాలని ప్లాన్ చేశారు. దీనికి యంగ్​ టైగర్​ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు ప్రకటించారు. దీంతో తారక్ అభిమానుల్లో ఉదయం నుంచే జోష్ నెలకొంది. ఎన్టీఆర్ ఫర్ బ్రహ్మాస్త్ర అనే హ్యాష్​ట్యాగ్​లతో ట్విట్టర్​లో సందడి చేశారు. ఎన్టీఆర్ బ్యానర్లు, పోస్టర్లతో భారీ ఎత్తున రామోజీ ఫిలిం సిటీకి చేరుకున్నారు.

ఈ క్రమంలోనే ఎన్టీఆర్ ఫ్యాన్స్​కు చేదువార్త తెలిపింది ఈవెంట్ మేనేజ్​మెంట్ సంస్థ శ్రేయాస్ మీడియా. ఆర్​ఎఫ్​సీలో ఈవెంట్​ను అనివార్య కారణాల వల్ల రద్దు చేసినట్లు ప్రకటించింది. దీంతో భీమ్​ అభిమానులు నిరాశకు గురువుతున్నారు. తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే రాత్రి 7.30 గంటలకు పార్క్​ హయత్​లో చిత్రబృందం సహా రాజమౌళి మీడియాతో సమావేశం కానున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమంలో తారక్ ముఖ్య అతిథిగా పాల్గొనబోతున్నారని మూవీ యూనిట్ తెలిపింది.

brahmastra pre release event cancelled jr ntr fans dissappointed

రణ్​బీర్​ కపూర్, ఆలియా భట్ జంటగా నటించిన ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. అమితాబ్ బచ్చన్, నాగార్జున కీలక పాత్రలు పోషించారు. సెప్టెంబర్ 9న హిందీ సహా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X