బ్రహ్మానందం, అలీ ..మధ్యలో సప్తగిరి

By Srikanya

హైదరాబాద్ :బ్రహ్మానందం తెరమీద కనిపిస్తే ఆ సందడే వేరు. సెట్ లోనూ అంతే ఆయన్ని కలిస్తేనే పండగ వాతావరణం వస్తుందని అలాంటిది బ్రహ్మానందంతో కలిసి పనిచేయడం చాలా సరదాగా ఉంటుందని నటుడు అలీ అన్నారు. ఈ విషయాన్ని ఆయన తన అధికారిక ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా తెలుపుతూ 'లోఫర్‌' చిత్రం సెట్స్‌లోని ఓ ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. దీనికి సంబందించిన పోస్ట్ ఇక్కడ మీరు చూడవచ్చు.


గతంలో వీరిద్దరూ పూరి దర్సకత్వంలో వచ్చిన పోకిరి, సూపర్ సినిమాలో చేసిన కామెడీకి ప్రేక్షకులు ఇంకా నవ్వుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు మరోసారి అలాంటి ఫన్ రిపీట్ అవనుందని చెప్తున్న్రారు. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో వరుణ్‌తేజ్‌ హీరోగా నటించిన చిత్రం 'లోఫర్‌' లో ఈ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అయ్యింది.

చిత్రం విశేషాల్లోకి వెళితే..

సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై. లిమిటెడ్‌ సి.కళ్యాణ్‌ సమర్పణలో శ్రీశుభశ్వేత ఫిలింస్‌ పతాకంపై సి.కళ్యాణ్‌ ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టీజర్ ఈ మధ్యనే రిలీజై మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం బిజినెస్ ఊపందుకుందని సమాచారం.

Brahmi Ali Back to Back in Loafer movie

ముఖ్యంగా కంచె హిట్ ఈ చిత్రం బిజినెస్ బాగా కలిసి వచ్చిందని చెప్తున్నారు. దాంతో నైజాం ఏరియాలో ఎవరూ ఊహించని రేటుకు ఈ చిత్రం వెళ్లిందని తెలుస్తోంది. నైజాం ఏరియాలో అభిషేక్ పిక్చర్స్ వారు ఏడున్నర కోట్లుకు సొంతం చేసుకున్నట్లు సమాచారం.

వరుణ్‌తేజ్‌ మాట్లాడుతూ ''నా కెరీర్‌ బిగెనింగ్‌లోనే పూరి జగన్నాథ్‌ వంటి పెద్ద డైరెక్టర్‌తో పనిచేసే అవకాశం వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. లోఫర్‌ సబ్జెక్ట్‌ వినగానే ఎంతో ఎగ్జైట్‌ అయ్యాను. పూరిగారి దర్శకత్వంలో వస్తోన్న ఈ చిత్రం మంచి మాస్‌ ఎంటర్‌టైనర్‌గా అందర్నీ ఆకట్టుకుని నా కెరీర్‌కి టర్నింగ్‌ పాయింట్‌ అవుతుంది'' అన్నారు.

నిర్మాత సి.కళ్యాణ్‌ మాట్లాడుతూ ''వరుణ్‌తేజ్‌ తొలిసారి చేస్తున్న మాస్‌ ఫిల్మ్‌ ఇది. మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌తోపాటు, మదర్‌ సెంటిమెంట్‌, హై యాక్షన్‌ ఈ చిత్రంలో వుంటుంది. హీరో క్యారెక్టరైజేషన్‌ మాసీగా వుంటుంది. రవితేజకి ఇడియట్‌, మహేష్‌కి పోకిరి, ఎన్టీఆర్‌కి టెంపర్‌, చరణ్‌కి చిరుతల, బన్నికి దేశముదురు ఎలా మాస్‌ సినిమాలు అయ్యాయో అలా వరుణ్‌తేజ్‌కి 'లోఫర్‌' మంచి మాస్‌ సినిమా అవుతుంది. వరుణ్‌తేజ్‌ డిఫరెంట్‌ క్యారెక్టరైజేషన్‌తో ఆల్‌ క్లాసెస్‌ ఆడియన్స్‌ని అలరించే పూరి మార్క్‌ చిత్రంగా 'లోఫర్‌' రూపొందుతుంది'' అన్నారు.

ఈ చిత్రంలో దిశా పటాని, బ్రహ్మానందం, రేవతి, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, ముకేష్‌ రుషి, సంపూర్ణేష్‌ బాబు, సప్తగిరి, పవిత్ర లోకేష్‌, ఉత్తేజ్‌, భద్రమ్‌, శాండీ, ధనరాజ్‌, టార్జాన్‌, చరణ్‌దీప్‌, వంశీ, రమ్య తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కో రైటర్స్‌: కళ్యాణ్‌ వర్మ, కిరణ్‌, ఫైట్స్‌: విజరు, సంగీతం: సునీల్‌ కశ్యప్‌, సినిమాటోగ్రఫీ: పి.జి.వింద, ఆర్ట్‌: విఠల్‌ కోసనం, ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X