బ్రహ్మీ ‘గజదొంగ’ లేటెస్ట్ ఇన్ఫో...
చైతన్య, ప్రకృతి జంటగా బ్రహ్మానందం టైటిల్ పాత్రలో రూపొందుతున్న చిత్రం 'గజదొంగ'. భవానీ మూవీస్ పతాకంపై శ్రీనివాసరావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆర్.ఎస్ సురేష్ దర్శకుడు. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో తొలి షెడ్యూల్ జరుపుకుంటున్న ఈచిత్రం విశేషాలను దర్శకుడు తెలియజేస్తూ 'కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో బ్రహ్మానందం కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఆయన పాత్ర చట్టే కథ నడుస్తుంది. జూలై 23 నుంచి హైదరాబాద్‌లో హీరో, హీరోయిన్, ఇతర ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాం. ఈ నెల 5 వరకు ఈ షెడ్యూల్ కొనసాగుతుంది. ఈ నెల 10 నుంచి మరో షెడ్యూల్ ప్రారంభిస్తాం. ముళ్లపూడి రచనలంటే ఇష్టపడే కథానాయకుడు అనుకోకుండా ఓ ప్రేమలో పడతాడు. వారి ప్రేమకు ఓ గజదొంగ ఎలా సహకరించాడన్నదే ఈచిత్రంలో ఆసక్తికరం' అన్నారు.
రెండున్నర గంటల పాటు ప్రేక్షకులని ఎంటర్‌టైన్ చేసే సినిమా అని తెలిపారు. అలీ, జీవా, రఘుబాబు, ఎమ్మెస్ నారాయణ, చిత్రం శ్రీను, కొండవలస, తాగుబోతు రమేష్, ధన్‌రాజ్, శివన్నారాయణ, రాజ్యలక్ష్మి, లక్ష్మి, ప్రియ, మధుబాబు తదితరులు నటిస్తున్న ఈచిత్రానికి కథ: శ్రీనివాస్.డి, మాటలు: మరుధూరి రాజా, రచనా సహకారం: నరేంద్ర, సంగీతం: ఆది, కెమెరా: రాహుల్, ఎడిటింగ్: ఉపేంద్ర, ఆర్ట్: గోవింద్, సహ నిర్మాత: బొడ్డు నాగేశ్వరరావు.


Click it and Unblock the Notifications












