అల్లరి నరేష్ సినిమాలో ‘ఆకు’గా బ్రహ్మానందం
టాలీవుడ్ నవ్వుల డాన్ బ్రహ్మానందం గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. తన కామెడీతో ఒంటి చేత్తో సినిమాను నెగ్గుకురాగల కామెడీ సత్తా ఉన్నోడు. అందుకే పెద్ద హీరోల సినిమాల్లో బ్రహ్మానందాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా ఒక క్యారెక్టర్‌ను సృష్టించుకుంటారు దర్శకులు. నాగార్జున మన్మధుడు సినిమాలో 'మిస్టర్ లవంగం'గా అలరించిన బ్రహ్మీ ఆ తర్వాత రెడీ సినిమాలో మెక్ డోవెల్ మూర్తి పాత్రలో, కొంచెం ఇష్టం కొంచెం కష్టం సినిమాలో గచ్చిబౌలి దివాకర్ పాత్రలో, కింగ్ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ జయసూర్య పాత్రలో, పవన్ కళ్యాణ్ పంజా సినిమాలో పాపారాయుడు పాత్రలో, పద్మశ్రీగా దూకుడు సినిమాలో ప్రేక్షకులకు నవ్వుల విందు చేశారు.
తాజాగా బ్రహ్మానందం అల్లరి నరేష్, శర్వానంద్ కాంబినేషన్లో రూపొందుతున్న 'నువ్వా నేనా' అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో బ్రహ్మీ 'ఆకు' పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రంలో అల్లరి నరేష్, శర్వానంద్ శ్రియ కోసం ట్రై చేస్తుంటారని, వీరికి పోటీగా బ్రహ్మీ శ్రియను ట్రై చేసే పాత్రలో కనిపించనున్నాడని తెలుస్తోంది. నారాయణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఎస్.వి.కె బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రం రొమాంటిక్ అండ్ కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందుతోంది.


Click it and Unblock the Notifications











