ఎన్టీఆర్ 'బాద్ షా' లో బ్రహ్మానందం పాత్ర పేరు, క్యారెక్టర్
హైదరాబాద్: శ్రీను వైట్ల చిత్రాల్లో బ్రహ్మానందం కు ప్రత్యేకమైన క్యారక్టరైజేషన్ ఉంటుందన్న సంగతి తెలిసింది. దాదాపు బ్రహ్మి సెకండ్ ఇన్నింగ్స్ శ్రీనువైట్ల తోనే ప్రారంభించాడని చెప్పుకోవచ్చ. ఈ నేపధ్యంలో శ్రీను వైట్ల తాజా చిత్రం బాద్షా లో ఆయన పాత్రపై అందరికీ ఆసక్తి ఉంది. ఈ సారి ఏ పాత్రతో బ్రహ్మిని నవ్విస్తాడో అని ఎదురుచూస్తున్నారు. విశ్వసనీయంగా అందిన సమాచారం ప్రకారం ఈ చిత్రంలో బ్రహ్మానందం పాత్రం పేరు 'జమదగ్ని IPS' అని తెలుస్తోంది.
పవర్ ఫుల్ పోలీస్ అధికారిగా ఫీలైపోతూ ఇందులో బ్రహ్మానందం నవ్వులు పూయించనున్నారని తెలుస్తోంది. ఇంటర్నేషనల్ పోలీస్ ల నుంచి తప్పించుకునే డాన్ ఎన్టీఆర్ ని పట్టుకుంటానని శపధం చేసి తిరిగే పాత్ర అని తెలుస్తోంది. కొన్ని విజువల్ ఎఫెక్ట్స్ వాడి మరీ ఈ పాత్రను మరింత కామెడీగా తీర్చి దిద్దినట్లు సమాచారం. బ్రహ్మానందం కెరీర్ లో మరో మంచి పాత్రగా ఈ చిత్రం నిలుస్తుందని చెప్పుకుంటున్నారు.
ఈ సినిమా గురించి నిర్మాత మాట్లాడుతూ- ''తెలుగు చిత్రపరిశ్రమలోనే భారీ బడ్జెట్ చిత్రం ఇది. ఎన్టీఆర్, కాజల్‌లతో పాటు తెలుగు, తమిళ, హిందీ రంగాలకు చెందిన 50మందికి పైగా ప్రముఖ నటీనటులు ఇందులో నటిస్తున్నారు. ఆసక్తిగొలిపే కథ, కథనాలతో ఈ సినిమా రూపొందుతోంది. ఇందులోని యాక్షన్, ఎమోషన్, రొమాన్స్ ప్రేక్షకుల్ని అద్భుతంగా ఎంటర్‌టైన్ చేస్తాయి. 'బాద్‌షా'గా ఓ కొత్త ఎన్టీఆర్‌ని చూస్తారు'' అని తెలిపారు.
''ఎన్టీఆర్ ఇమేజ్‌కి తగ్గట్టుగా ఉంటూనే నా స్టైల్‌లో పూర్తి వినోదభరితంగా సినిమా ఉంటుంది. ఇందులో ఎన్టీఆర్ పాత్ర చిత్రణ, ఆయన లుక్ కొత్తగా ఉంటుంది. నందమూరి అభిమానులు పండుగ చేసుకునే సినిమా అవుతుంది'' అని శ్రీనువైట్ల చెప్పారు. తమన్, గోపీమోహన్, కోన వెంకట్, ఎ.ఎస్.ప్రకాష్, ఎం.ఆర్.వర్మ, చలసాని రామారావు తెరవెనుక ప్రముఖంగా పనిచేస్తున్న ఈ చిత్రానికి సమర్పణ: శివబాబు బండ్ల.


Click it and Unblock the Notifications











