బ్రహ్మీకి పవన్ కళ్యాణ్ వాయింపులు ఓ రేంజ్ లో ..

By Bojja Kumar

టాలీవుడ్ కామెడీ స్టార్ బ్రహ్మానందాన్ని...పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ రేంజ్ లో వాయించేందుకు సిద్ధం అవుతున్నాడు. కొంపతీసి ఇదంతా రియల్ లైఫ్ లో అనుకునేరు, మేం చెబుతున్నది రీల్ లైఫ్ తతంగమండీ బాబూ. పవన్ కళ్యాణ్ హీరోగా విష్ణువర్ధన్ దర్శకత్వంలో 'పంజా" సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ స్టయిలిస్ అప్పియరెన్స్, యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని మాత్రమే మనం ఇంతకాలం భావించాం. విశ్వసనీయంగా అందిన సమాచారం ప్రకారం ఇందులో జల్సాను మించిపోయే రేంజ్ లో కామెడీ సన్నివేశాలు కూడా ఉంటాయట. కామెడీ స్టార్ బ్రహ్మీ ఈ సినిమాలో దాదాపుగా ఫుల్ లెన్త్ రోల్ లో నవ్వులు పండిచనున్నాడని పంజా యూనిట్ సభ్యుల సమాచారం. అదే నిజమైతే పవర్ స్టార్ అభిమానులు నవ్వి..నవ్వి కడుపు చెక్కలు చేసుకోవడం ఖాయం.

ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన సారా జాన్ డియాస్, అంజనా లవానియాలు నటిస్తున్నారు. విష్ణువర్ధన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు నీలిమా తిరుమలశెట్టి, శోభు యార్లగడ్డలు ఆర్కా మీడియా, సంఘమిత్ర ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఆడియో నవంబర్ 19న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. డిసెంబర్ లో సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X