twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘దేనికైనా రెడీ’ చిత్రంపై బ్రాహ్మణుల ఆగ్రహం!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: మంచు విష్ణు, హన్సిక హీరో హీరోయిన్లుగా రూపొందిన 'దేనికైనా రెడీ' చిత్రంపై వివాదం నెలకొంది. బ్రాహ్మణకులాన్ని కించపరిచే విధంగా ఈచిత్రం ఉందని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య రాష్ట్ర యువజన అధ్యక్షుడు ద్రోణంరాజు రవి కుమార్ ఆరోపించారు.

    సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో బ్రాహ్మణ సంఘాల నేతలు మాట్లాడుతూ ఇటీవల విడుదలైన దేనికైనా..రెడీ అనే సినిమాలో ఓ మాంసం ముక్కను తీసుకొని వచ్చి బ్రాహ్మణుని చేతిలో పెట్టి అతనితో మాంసం తినిపించే సన్నివేశాలు, హలీం ఆరగించే సన్నివేశాలు ఉన్నాయని ఇటువంటి వాటికి సెన్సార్‌బోర్డు అభ్యంతరం తెలపకపోవడం ఎంతో దుర్మార్గమని వారు అన్నారు.

    బ్రాహ్మణ కులాన్ని సినిమాల్లో హాస్యానికి వాడుకుంటున్నారని, మా భాష, యాసను హేళన చేస్తూ సన్నివేశాలు చిత్రిస్తున్నారని దీనిని వెంటనే మానుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఇటీవలే బ్రాహ్మణిజం సినిమాపై ఆందోళన కార్యక్రమాలు చేసి విషయాన్ని గుర్తు చేస్తూ..... వెంటనే ఈచిత్రంలోని అభ్యంతర కర సన్నివేశాలు తొలగించాలని డిమాండ్ చేసారు.

    కాగా... వరుస ప్లాపులతో కొట్టుమిట్టాడిన మంచు విష్ణు ఎట్టకేలకు తన తాజా సినిమా 'దేనికైనా రెడీ' చిత్రంతో నిలదొక్కుకున్నాడు. దేనికైనా రెడీ చిత్రానికి బాక్సాఫీసు వద్ద అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. మంచు విష్ణు కెరీర్లోనే ఈచిత్రం హయ్యెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. ట్రేడ్ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం ఈ చిత్రం 'సుడిగాడు' చిత్రం రికార్డులను బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్.వంశీకృష్ణ, సమర్పణ: శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, నిర్మాణం: 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, నిర్మాత: డా.ఎం.మోహన్‌ బాబు, దర్శకత్వం: జి. నాగేశ్వర రెడ్డి.

    English summary
    After Cameraman Ganga Tho Rambabu ran into trouble with pro Telangana activists.... Now Vishnu Manchu-starrer Denikaina Ready irked the Brahmin community.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X