twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మోహన్‌బాబు పతనం లక్ష్యంగా ‘మహాయజ్ఞం’

    By Srikanya
    |

    వరంగల్‌: చిన్నగా మొదలైన 'దేనికైనా రెడీ' వివాదం రోజుకో రూపు దాలుస్తోంది. కమిటి చెప్పిన కట్స్ చెల్లవంటూ కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్న మోహన్ బాబు పై బ్రాహ్మణ సంఘాలు మండిపడుతున్నాయి. బాహ్మణుల మనోభావాలను కించపరిచే విధంగా సినిమా రూపొందించారంటూ నటుడు, నిర్మాత మంచు మోహన్‌బాబు, అతని కుటుంబం పతనాన్ని ఆకాంక్షిస్తూ బ్రాహ్మణులు వరంగల్ లో మహాయజ్ఞం నిర్వహించారు. తెలంగాణ అర్చక సమాఖ్య జిల్లా అధ్యక్షులు గంగు ఉపేంవూదశర్మ నేతృత్వంలో వైదిక బ్రాహ్మణ సంఘం సహకారంతో వరంగల్ స్టేషన్‌రోడ్‌లో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసి రుద్రహోమంలో పాల్గొన్నారు. గణపతి, నవగ్రహ, నమక, చమక, శ్రీసూక్త, పురుషసూక్త, మణ్యసూక్త మూల మంత్రాలతో మహాయజ్ఞం నిర్వహించారు.

    ఐదుకోట్ల హిందువులను అవమానపరిచిన మోహన్‌బాబు కుటుంబం పతనం కావాలని, నగరంలో నిర్వహించబోయే శంఖారావం విజయవంతం కావాలని కోరుతూ నిర్వహించిన ఈ యజ్ఞానికి జిల్లా నలుమూలల నుంచి బ్రాహ్మణులు తరలివచ్చారు. ఈ సందర్బంగా గంగు ఉపేంవూదశర్మ మాట్లాడుతూ రాజకీయాలకతీతంగా శంఖారావానికి తరలిరావాలని పిలుపునిచ్చారు. బ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షులు వెంకట సత్యమోహన్ మాట్లాడుతూ సమాజానికి, రాష్ట్రానికి ఎంతో సేవలందిస్తున్న బ్రాహ్మణులు తమ ఆత్మగౌరవ పరిరక్షణ కోసం ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు.

    మరో ప్రక్క 'దేనికైనా రెడీ' చిత్రంలో బ్రాహ్మణులను కించపరుస్తున్న సన్నివేశాలను తొలగించాలని ముంబై లోని తెలుగు బ్రాహ్మణ మహాసభ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఒక ప్రకటనను జారీ చేసింది. చిత్రంలోని సన్నివేశాలపై నిరసన తెలిపిన బ్రాహ్మణులపై దాడులు అన్యాయమని, బాధ్యులు మోహన్‌బాబు, విష్ణువర్ధన్‌పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని సభ్యులు డిమాండ్‌ చేశారు. రాష్ట్రమంతా ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం, సెన్సార్‌ బోర్డు నిమ్మకు నీరెత్తినట్లు ఉండటం శోచనీయమన్నారు. నిరసన తెలిపిన వారిలో సంఘం అధ్యక్షులు జి.వి.రావు, కార్యదర్శి వి.ఎన్‌.ఎస్‌.మూర్తి, మహిళా సభ్యులు సుజాత మూర్తి, విజయ, త్రిపుర సుందరి ఉన్నారు.

    మోహన్‌బాబును ఎందుకు అరెస్ట్‌ చేయడం లేదంటూ స్త్రీరక్ష సమితి ప్రశ్నించింది. బ్రాహ్మణులను, మహిళలను కించ పరుస్తూ రూపొందించిన దేనికైనా రెఢీ చిత్రాన్ని నిర్మించిన మోహన్‌బాబును దేనికి అరెస్ట్‌ చేయడం లేదని స్త్రీరక్ష సమితి ప్రశ్నించింది. ఆయనను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేసింది. అధే విధంగా మోహన్‌బాబు బహిరంగ క్షమాపణ చెప్పాలని కోరింది. లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉద్థృతం చేస్తామని హెచ్చరించింది. బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో స్త్రీరక్ష సమితి రాష్ట్ర అధ్యక్షురాలు సుమలతశర్మ, ప్రధాన కార్యదర్శి నీలందేవి తోపాటు పలు బ్రాహ్మణ సంఘాల నేతలు మాట్లాడారు. మోహన్‌బాబు ఇకపై తీసే అన్ని చిత్రాలను బహిష్కరిస్తామని తెలియజేశారు.

    English summary
    
 Media reports say that, a group of Brahmins followed the ritual of citing the powerful mantras and have performed 'Maha Yagnam' against Manchu mohan babu. However, the versatile Collection King still hasn't reacted anything on the entire episode.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X