రౌడీ బ్రాహ్మణులూ ఉన్నారు... రా : విష్ణుకు సవాల్
హైదరాబాద్ : 'దేనికైనా రెడీ' చిత్రాన్ని నిషేదించాలంటూ బ్రాహ్మణ సంఘాల నేతలు సోమవారం హోమంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసి వినతి పత్రం అందించారు. అనంతరం బ్రాహ్మణ సంఘాల నేతలు మీడియాతో మాట్లాడుతూ 'దేనికైనా రెడీ' చిత్రం బ్రాహ్మణుల మనో భావాలను దెబ్బతీసే విధంగా ఉందని, బ్రాహ్మణ మహిళలను సినిమాలో అభ్యంతర కరంగా చూపించారని మండి పడ్డారు.
ఓ బ్రాహ్మణ నేత మాట్లాడుతూ....'సినీ నటుడు మంచు విష్ణు బ్రహ్మణులను హైదరాబాద్‌లో తిరగనివ్వం అంటున్నాడు, బ్రాహ్మణుల్లో సౌమ్యంగా ఉండే బ్రహ్మణులే కాదు, రౌడీ బ్రాహ్మణులు కూడా ఉన్నారు. నువ్వు సినిమాలో దేనికైనా రెడీ అయితే, మేము రియల్ లైఫ్ లో దేనికైనా రెడీ, చూసుకుందాం రా' అంటూ సవాల్ విసిరారు.
సినిమాను నిషేదించే వరకు ఆందోళన కార్యక్రమాలు ఆపబోమని, తమను అవమానించే విధంగా సినిమాను తీసి...తమ పట్ల అమర్యాదగా ప్రవర్తించిన, దాడి చేయించిన మోహన్ బాబు కుటుంబం బేషరుతుగా క్షమాపణ చెప్పాలని బ్రాహ్మణ సంఘాల నేతలు డిమాండ్ చేసారు.
మరో వైపు 'దేనికైనా రెడీ' మూవీ వివాదం నేపథ్యంలో ఈ చిత్రం యూనిట్ పై మల్కాజ్ గిరి పోలీసులు కేసు నమోదు చేసారు. నిర్మాత మోహన్ బాబు, హీరోమంచు విష్ణు, కమెడియన్ బ్రహ్మానందం, దర్శకుడు జి నాగేశ్వరరెడ్డిపై ఐపిసి 150ఎ, 120బి, 153 ఎ, 295 ఎ, 298 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.


Click it and Unblock the Notifications











