'అదుర్స్' బ్రాహ్మణ జాతిని కించపరిచింది
బ్రాహ్మణ జాతిని కించపరిచిన 'అదుర్స్' సినిమాను నిలిపివేయాలని కోరుతూ సోమవారం మానవహక్కుల కమిషన్‌లో పిటిషన్ దాఖలైంది. తెలంగాణ బ్రాహ్మణ సంఘాల సమాఖ్య అధ్యక్షుడు చకిలం రాజేశ్వరరావు ఈ పిటిషన్ దాఖలు చేశారు. సినిమాలోని 'చారి' అనే పాటలో 'పిలకజుట్టు' అనే పదానికి బదులుగా 'పాత బైక్' అని, 'నిలువు బొట్టు' స్థానంలో 'ఓల్డ్ స్టైల్' అని మార్పులు చేసి, మిగతా పాటను యథాతథంగా ఉంచారని పిటిషనర్ ఆరోపించారు.
బ్రాహ్మణకులానికి చెందిన ఇద్దరు క్లబ్‌డాన్స్‌కు వెళ్లడం, బీరుతాగడం లాంటి సన్నివేశాలు బాధించాయని, దహన సంస్కారాల సందర్భంగా నిర్వహించే సన్నివేశమూ అస్తిత్వాన్ని దెబ్బతీసేలా ఉందని వివరించారు. ఆ సినిమా పాటల సీడీలు, క్యాసెట్ల అమ్మకాలను నిలిపివేయాలని, 'చారి' పాటను నిషేధించాలని పిటిషనర్ అభ్యర్థించారు. దీనిపై స్పందించిన కమిషన్ ఈనెల 22లోగా నివేదిక సమర్పించాలని ప్రాంతీయ సెన్సార్ బోర్డును ఆదేశించింది.


Click it and Unblock the Notifications











