twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'దేనికైనా రెడీ' లో వివాదం రేపుతున్న సీన్స్ ఏంటి?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: గత నాలుగు రోజులుగా మంచు విష్ణు తాజా చిత్రం 'దేనికైనా రెడీ' వివాదంలో నలుగుతున్న సంగతి తెలిసిందే. రోజు రోజుకీ ముదురుతున్న ఈ చిత్రం వివాదంలో అసలు వివాదాస్పద అంశాలు ఉన్నాయా అనేది చాలా మందికి కలిగే సందేహం. ఇంతకీ సినిమాలో ఏముంది...

    సినిమాలో హీరో మంచు విష్ణు... సులేమాన్ అనే ముస్లిం(అతని తండ్రి ముస్లిం, తల్లి హిందువు.. ప్రేమ వివాహం) గా కనిపిస్తారు. అతనికి తన తల్లి ప్రేమ వివాహంతో విడిపోయిన మేనమామ కుటుంబాన్ని కలపాలనే లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్యం నెరవేర్చుకోవటానికి అతనికి కృష్ణ శాస్త్రి అనే తన కాలేజ్ మేట్ తో అవకాసం వస్తుంది. దాంతో సులేమాన్ తన మేనమామ(ప్రభు) ఇంట్లో చండీ యాగం జరిపించటానికి కృష్ణ శాస్త్రి రూపంలో వెళ్తాడు.

    దాంతో ఓ ముస్లిం... పవిత్రమైన చండీ యాగం చేయించినట్లు అయ్యింది (యజ్ఞం చేస్తున్న సమయంలో మరో మతస్తుడిని ఆచార్యులుగా చూపించడం... ఇది వివాదంలో తొలి అంశం)

    ఇక హీరో తనకు మంత్రాలు రావు కాబట్టి ఖాళీగా ఉన్న బ్రాహ్మణులు(ధర్మవరపు, మాస్టర్ భరత్ తదితరులు) ని చండీ యాగం కు తీసుకు వెళ్తాడు. అక్కడ తనకు మంత్రాలు రావు కాబట్టి హీరో అందరూ మంత్రాలు చదువుతూంటే... తాను బిజినెస్ మ్యాన్ చిత్రంలో సార్ వస్తారా పాట పాడుతూ కూర్చుంటాడు(ఛండీయాగంలో మంత్రాలకు బదులుగా బ్రహ్మాణోత్తములచే సినిమా పాటలు పాడించడం వేదాన్ని అవమానించినట్లే..ఇది వివాదంలో మరో అంశం).

    ఇక హీరోకు తోడుగా వెళ్ళిన బ్రాహ్మణుల బ్యాచ్ లో ఉన్న మాస్టర్ భరత్... ప్రక్కింటి లో ఉన్న ముస్లిం అమ్మాయితో చనువుగా ఉండి.. ఆమెకు లైన్ వేస్తూంటాడు. ఆ క్రమంలో ఆమె తినమని హలీం ఇస్తుంది. అది హలీం అని తెలియక.. వెళ్లి తన తోటి బ్రాహ్మణులతో లొట్టలు వేసుకుంటూ తినేస్తారు. తర్వాత విషయం తెలిసి కక్కుకుంటారు. (మాసంతో చేసిన హలీంను బ్రహ్మణోత్తములకు తినిపించడం బ్రహ్మణుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయినేది మరో వివాదాంశం).... అయితే సెకండాఫ్ లో ఆమె తాను హలీం ఇవ్వలేదని చెప్పుతుంది.

    మరో సారి... ఎమ్ ఎస్ నారాయణ పాత్ర(ఇంటి బ్రాహ్మడు పాత్ర)ద్వారా... చికెన్... హీరోతో వచ్చిన బ్రాహ్మణులకు అందుతుంది. వారు ఆ ముక్కలను ఆబగా తినాలని చూడటం మరోసారి చూపెట్టారు.

    కృష్ణ శాస్త్ర్రి తల్లి (సురేఖా వాణి) పాత్ర ఎవర్ని చూసినా తన భర్త లాగే ఒడ్డూ పొడుగూ ఉన్నారంటూ వెంటబడుతూంటుంది. మొదట బ్రహ్మానందం వెనక, తర్వాత ధర్మవరపుపై ఆమె మోహం చూపినట్లు చూపారు. (బ్రహ్మణ మహిళ పాత్రను కూడా చిత్రంలో వ్యాంపు క్యారెక్టర్‌గా చిత్రీకరించి, బ్రహ్మణ మహిళలను కించపరిచారనేది వివాదం).

    ఇవీ ఈ సినిమాలో ఉన్నాయని చెప్పబడుతున్న ఆరోపణలకు చెందిన సీన్స్. కామెడీ కోసం సీన్స్ కదా.. అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. మంచు విష్ణు సైతం సినిమాను సినిమాలాగే చూడాలంటున్నారు.

    English summary
    Manchu Vishnu – Hansika starrer Denikaina Ready is now facing the heat from Brahmin చorganizations across the state.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X