మంచు విష్ణు, మోహన్‌బాబు క్షమాపణ చెప్పాలంటూ ర్యాలి
గుంటూరు: దేనికైనా రెడీ సినిమాలో బ్రాహ్మణులను కించపరిచే పాత్రలను వెంటనే తొలగించాలని, రాష్ట్రంలోని బ్రాహ్మణులకు మంచు విష్ణు, మోహన్‌బాబు క్షమాపణ చెప్పాలని ఏపీ బ్రాహ్మణ సంఘం కార్యదర్శి శిరిపురపు వెంకట శ్రీధర్ డిమాండ్ చేశారు. మంచు విష్ణు నటించిన 'దేనికైనా రెడీ' చిత్రంలోనూ బ్రాహ్మణులను చులకన చేసే సన్నివేశాలను వెంటనే తొలగించాలన్నారు. బ్రాహ్మణ సంఘం రాష్ట్ర కార్యదర్శి సిరిపరపు శ్రీధర్ మాట్లాడుతూ ప్రజల మనోభావాలను దెబ్బతీసే చిత్రాలను నిలిపివేయాలన్నారు. మోహన్‌బాబు నిర్మించిన ఈ చిత్రంలో బ్రాహ్మణులను కించపరిచే సన్నివేశాలున్నాయని, వాటిని వెంటనే తొలగించటమే కాకుండా ఆయన బ్రాహ్మణులకు క్షమాపణలు చెప్పాలని డిమాండు చేశారు.
ఈ సందర్భంగా సిరిపురపు శ్రీధర్ మాట్లాడుతూ... ఇటీవల కాలంలో బ్రాహ్మణులను, స్త్రీలను కించపరిచేలా అనేక చిత్రాలు వస్తున్నాయని, వీటిపై సెన్సార్ బోర్డు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టిసారించటం లేదన్నారు. అనంతరం శంకర్‌విలాస్ కూడలిలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను, కొరిటెపాడు సమీపంలోని ఓ థియేటర్ వద్ద 'దేనికైనా రెడీ' చిత్ర పోస్టర్లను దహనం చేశారు. బ్రాహ్మణులను కించపరిచేలా సినిమాలను నిర్మిస్తే సహించేది లేదని ఏపీ బ్రాహ్మణ సంఘం హెచ్చరించింది. దేనికైనా రెడీ సినిమాలో బ్రాహ్మణులను కించపరిచే దృశ్యాలను తొలగించాలని డిమాండ్ చేస్తూ బ్రాడీపేట 4వలైను నుంచి అరండల్‌పేట వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ఓవర్‌బ్రిడ్డి ముందు బైఠాయించి రాస్తారోకో చేశారు.
దేనికైనా రెడీ సినిమాను నిలిపివేయాలని, బ్రాహ్మణులను కించపరిచే సినిమాలను ప్రదర్శిస్తే ఆందోళనను ఉధృతం చేస్తామన్నారు. అంతకుముందు బ్రాహ్మణ సంఘాల నాయకుల శంకర్‌విలాస్ కూడలి నుంచి ర్యాలీ నిర్వహించారు. అరండల్‌పేట ఓవర్ బ్రిడ్జి వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. హిందీలో వచ్చిన 'ఉమన్ ఇన్ బ్రాహ్మనిజం' చిత్రంలో బ్రాహ్మణ మహిళలను కించపరిచేవిగా సన్నివేశాలను చిత్రీకరించారని, ఆ చిత్రాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండు చేశారు. ఆందోళనకారులు రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. అక్కడినుంచి హరిహర మహల్ థియేటర్ వద్దకు చేరుకొని గేటు ఎదుట బైఠాయించారు.
దేనికైనారెడీ సినిమా వాల్‌పోస్టర్లు, హీరో మంచు విష్ణు, మోహన్‌బాబుల దిష్టిబొమ్మలను దహనం చేశారు. అరండల్‌పేట ఎస్‌ఐ బ్రాహ్మయ్య అక్కడికి వచ్చి నిరసన విరమించాలని కోరారు. ఎస్‌ఐకి, బ్రాహ్మణ సంఘాల నేతలమధ్య గంటకుపైగా వాగ్వాదం జరిగింది. ఒక దశలో నిరసనకారులను పోలీసులు రోడ్డుపక్కకు నెట్టివేయడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అనంతరం నేతలు ఎస్‌ఐకి సర్దిచెప్పి ఆందోళన కొనసాగించారు.


Click it and Unblock the Notifications











