»   » ఫస్ట్ లుక్: మహేష్ బాబు చెప్పులు తొడిగేది ఎవరికి?

ఫస్ట్ లుక్: మహేష్ బాబు చెప్పులు తొడిగేది ఎవరికి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా పి.వి.పి. సినిమా పతాకంపై శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో పెరల్‌ వి.పొట్లూరి, పరమ్‌ వి.పొట్లూరి నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'బ్రహ్మోత్సవం'. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ను ఉగాది సందర్భంగా విడుదల చేశారు. జనవరి 1న రిలీజ్‌ అయిన టీజర్‌కి అద్భుతమైన రెస్పాన్స్‌ వచ్చింది. ఈరోజు విడుదలైన ఫస్ట్‌ లుక్‌కి ఎక్స్‌లెంట్‌ రెస్పాన్స్‌ వస్తోంది. ఏప్రిల్‌ 24న ఈ చిత్రం ఆడియోను తిరుపతిలో చాలా గ్రాండ్‌గా రిలీజ్‌ చెయ్యబోతున్నారు.

సూపర్‌స్టార్‌ మహేష్‌ సరసన సమంత, కాజల్‌ అగర్వాల్‌, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్‌, జయసుధ, రేవతి, నరేష్‌, రావు రమేష్‌, తనికెళ్ళ భరణి, శుభలేఖ సుధాకర్‌, తులసి, ఈశ్వరీరావు, షాయాజీ షిండే, కృష్ణభగవాన్‌, రజిత, కాదంబరి కిరణ్‌, చాందిని చౌదరి తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.


Brahmotsavam First look

ఈ చిత్రానికి డైరెక్టర్‌ ఆఫ్‌ ఫోటోగ్రఫీ: ఆర్‌.రత్నవేలు, సంగీతం: మిక్కీ జె. మేయర్‌, డాన్స్‌: రాజుసుందరం, ప్రొడక్షన్‌ డిజైనర్‌: తోట తరణి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: సందీప్‌ గుణ్ణం, నిర్మాతలు: పెరల్‌ వి.పొట్లూరి, పరమ్‌ వి.పొట్లూరి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీకాంత్‌ అడ్డాల.

English summary
Brahmotsavam First look released. Brahmotsavam directed by Srikanth Addala which is simultaneously being shot in Telugu and Tamil languages. Produced by Prasad V Potluri under the banner PVP cinema, it features Mahesh Babu, Kajal Aggarwal, Samantha Ruth Prabhu, and Pranitha Subhash in the lead roles.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu