అదిరిపోయిందంతే.. (బ్రహ్మోత్సవం సాంగ్ మేకింగ్ వీడియో)
హైదరాబాద్: మహేష్ బాబు నటిస్తోన్న 'బ్రహ్మోత్సవం' సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ప్రమోషన్స్ స్పీడప్ చేసారు. ప్రతి రోజూ సినిమాకు సంబంధించిన కొత్త పోస్టర్స్, వర్కింగ్ స్టిల్స్, ఇతర ఫోటోలు రిలీజ్ చేస్తూ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగేలా చేస్తున్నారు.
ఇటీవల 'వచ్చింది కదా అవకాశం' అనే సాంగ్ రిలీజ్ చేసిన యూనిట్.... తాజాగా ఈ సాంగ్ మేకింగ్ వీడియో రిలీజ్ చేసారు. ఈ సాంగ్ కోసం ఆర్ట్ డైరెక్టర్ తోట తరణి వేసిన భారీ సెట్టింగ్స్ కలర్ ఫుల్ లుక్ తో అదిరిపోయింది. సినిమాలోని ప్రధాన తారాగణం మొత్తం ఈ సాంగులో ఉన్నారు.
సినిమాలో సంగీత్ ఈవెంటుకు సంబంధించిన ఈ సాంగ్ చిత్రీకరణ కూడా భారీగానే చేసారు. డాన్స్ మాస్టర్ రాజు సుందరం ఆధ్వర్యంలో పాట చిత్రీకరణ జరుగగా సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ఈ పాటను అద్భుతంగా తన కెమెరాలో బంధించారు. ఈ పాటను సిరివెన్నెల సీతారామ శాస్త్రి రచించగా...అభయ్ జోద్భూకర్ పాడారు. మిక్కీజే మేయర్ సంగీతం అందించారు.
సమంత, కాజల్, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మహేష్ బాబు సంబంధించిన 'మహేష్ బాబు ఎంటర్టెన్మెంట్స్', పివిపి సినిమాస్ సంస్థలు సంయుక్తంగా ఈచిత్రాన్ని నిర్మిస్తున్నాయి. వినోదాత్మకంగా నడిచే కుటుంబ కథాచిత్రమిది. ఉమ్మడి కుటుంబంలోని సంతోషాలకు ప్రతిరూపంగా ఈ చిత్రం ఉంటుంది. సత్యరాజ్, జయసుధ, నరేష్, రేవతి ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











