క్రిష్ ని బ్రెయిన్ వాష్ చేస్తున్నా: మంచు మనోజ్

By Srikanya

క్రిష్ తాజా చిత్రం వేదంలో మంచు మనోజ్ రాక్ ‌స్టార్ వివేక్ చక్రవర్తిగా పాత్రను చేసిన సంగతి తెలిసిందే. తెలుగులో విజయవంతమైన ఈ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం రీమేక్ హక్కుల్ని మెగా సూపర్‌గుడ్ ఫిలిమ్స్ పొందారు. ఈ సందర్భంగా మనోజ్ ట్విట్టర్ లో ట్వీట్ చేస్తూ..."ఈ సినిమాని డైరెక్ట్ చేయమని క్రిష్‌ని బ్రెయిన్ వాష్ చేస్తున్నాం" అని ఆయన అందులో తెలిపారు. అయితే క్రిష్ ఇంకా తన అంగీకారాన్ని తెలపలేదు అన్నారు. ఇక వేదంలో అల్లు అర్జున్ పోషించిన కేబుల్ రాజు పాత్రని చేయడానికి శింబు అంగీకరించారు. తెలుగులో తాను చేసిన వివేక్ చక్రవర్తి చేసిన పాత్రను తమిళంలో చేస్తారు. అలాగే తమిళంలో డైరక్ట్ చేయమని తనతో నిర్మాతలు సంప్రదింపులు జరుపుతున్నట్లు క్రిష్ చెప్పారని ట్వీట్ చేసారు. కాగా అనుష్క చేసిన అమలాపురం సరోజ పాత్రను నమిత చేయనుంది. ఈ సంగతిని కూడా తన ట్విట్టర్ పేజీలో మనోజ్ స్వయంగా తెలియజేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X