ఎవరికైనా ఏ టాలెంటైనా ఉంటుందని నమ్మి బ్రహ్మానందం మ్యూజిక్ డైరక్షన్ కి దిగాడు అనుకునేరు.అదేమీ కాదు...ఆయన 'కింగ్' సినిమాలో సంగీత దర్శకుడు పాత్రని పోషించనున్నాడు. శ్రీను వైట్ల దర్శకత్వంలో నాగార్జున హీరోగా చేస్తున్న ఈ సినిమాకు బ్రహ్మానందం మ్యుజిక్ ట్రాక్ ఓ ప్రత్యేకతను సంతరించుకుని నవ్వుల పుయ్యిస్తుందని తెలుస్తోంది.ఇక 'రెడీ' చిత్రంలో మెక్ డోనాల్డ్ మూర్తిగా జీవించి సినిమాను తన దైన శైలిలో లేపిన బ్రహ్మానందం ఈ చిత్రంలోనూ అదే పని చేయనున్నారు. అందులోనూ కామిడీ పంచ్ తెలిసిన దర్శకుడు శ్రీను వైట్ల కావటంతో ఈ సీన్లు మరింత పండుతాయని సినీ ప్రియులు సంబరపడుతున్నారు.