రేపు రామ్,జెనీలియా జంటగా శ్రీను వైట్ల రూపొందించిన 'రెఢీ' రిలీజవుతోంది. సినిమా వినోద ప్రధానంగా సాగుతుందనీ అందులోనూ బ్రహ్మానందం కామెడీ హైలెట్ అవుతుందనీ చెప్పుకుంటున్నారు. అందులో ఆయన మెక్ డోనాల్ట్ మూర్తిగా కనపడి నవ్విస్తారట. మొన్నటికి మొన్న 'కృష్ణ' సినిమాలో బాబి క్యారెక్టర్ మరిచిపోకముందే అదే పోలికలతో జల్సాలో హెడ్ కానిస్టేబుల్ ప్రణవ్ పాత్ర వచ్చింది. అందరికీ కిక్కెక్కిచ్చింది. ఇక 'ఢీ' లోని చారి పాత్ర అయితే ఇప్పటికీ ఆంధ్రాలో ఎక్కడోచోట మాట్లాడుకుంటున్నారు. దాంతో విచిత్రంగా ఈ పాత్రపై హైపు పెరుగుతోంది. అది గనుక హిట్ అయితే బ్రహ్మానందం హ్యట్రిక్ కొట్టినట్లే