24న బ్రహ్మానందం కుమారుడు వివాహం
హైదరాబాద్: పల్లకీలో పెళ్లి కొడుకు చిత్రంతో పరిచయమైన బ్రహ్మానదం కుమారుడు గౌతమ్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. సినిమాటోగ్రాఫర్ మరియు నిర్మాత శ్రీనివాస రెడ్డి కుమార్తెని వివాహం చేసుకోబోతున్నాడు. వీరిది ప్రేమ వివాహం అని తెలుస్తోంది. హైదరాబాద్ లోని HICC(హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్) లో ఈ నెల 24న ఘనంగా ఈ వివాహం జరగనుంది. ఇరు వైపులకు చెందిన వారు సినిమా వారే కావటంతో ఈ వివాహానికి సినిమావారు చాలా మంది హాజరుకానున్నారు. ఇప్పటికే ఈ మేరకు ఆహ్వానాలు జరుగుతన్నాయని సమాచారం.
ప్రస్తుతం గౌతమ్ మరో చిత్రం కమిటయ్యారు. నారా రోహిత్‍తో 'బాణం' చిత్రం రూపొందించి మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు చైతన్య దొందులూరి. తాజాగా ఈ దర్శకుడు 'బాసంతి' అనే చిత్రాన్ని రూపొందించబోతున్నారు. ఇందులో బ్రహ్మానందం తనయుడు గౌతంను హీరోగా ఎంచుకున్నాడు. హీరోయిన్, ఇతర వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.
బాణం చిత్రానికి మంచి టాకే వచ్చినా... బాక్సాఫీసు వద్ద మాత్రం కలెక్షన్లు కురిపించలేక పోయింది. అయితే చైతన్యకు మాత్రం విమర్శకుల ప్రశంసలు అందాయి. గౌతం ఇప్పటికే పలు చిత్రాల్లో నటించినా ఒక్కటి కూడా విజయవంతం కాలేదు. ఆయన చివరగా నటించిన 'పల్లకిలో పెళ్లి కూతురు', 'వారెవా' చిత్రాలు బాక్సాఫీసు వద్ద బోల్తా పడ్డాయి. మరి 'బాసంతి' చిత్రం వీరిద్దరి కెరీన్ ని మలుపు తిప్పుతుందో? లేదో? చూడాలి. పెళ్లి తర్వాత లక్ కలిసివస్తుందని అంటున్నారు.


Click it and Unblock the Notifications











