రియాల్టీ షోలో దారుణం : లైవ్‌లో రేప్
రియాల్టీ షోలో దారుణం చోటు చేసుకుంది. ఈ షోలో పాల్గొన్న కంటెస్టెంట్ తన కోస్టార్స్ ను రేప్ చేశాడు. షోలో కెమరాలన్నీ లైవ్ రికార్డింగులో ఉండగానే ఈ దారుణం చోటు చేసుకోవడం గమనార్హం. దీనిపై పోలీసులు విచారణ ప్రారంభించారు. మన దేశంలో జరిగే 'బిగ్ బాస్ షో' లాంటిదే ఈ రియాల్టీ షో.
వివరాల్లోకి వెళితే...
ప్రముఖ రియాల్టీ షో బిగ్ బ్రదర్ బ్రిజిలియన్ వెర్షన్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. షోలో భాగంగా మందు పార్టీ జరిగింది. ఇందులో అంతా పూటుగా మద్యం సేవించారు. ఈ క్రమంలో పురుష మోడల్ డేనియల్ తనతో పాటు ఈ షోలో పాటిస్పేట్ చేస్తున్న 23 ఏళ్ల అమ్మాయి మోనిక్ అమిన్‌ను రేప్ చేశాడు. ఆ సమయంలో తాగిన మత్తులో ఉన్న మోనిక్ అమిన్ అతన్ని ప్రతిఘటించ లేక పోయిందని తెలుస్తోంది. ఈ తతంగం అంతా లైవ్ కెమెరాల్లో రికార్డయింది కూడా.
విచారణ ప్రారంభించిన పోలీసులు సంఘటనకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఈ షోలో పాల్గొంటున్న వారందరినీ విచారిస్తున్నారు. త్వరలోనే ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వెంటనే ఈ షోను నిలిపి వేయాలని లేదా...డేనియల్‌ను షో నుంచి ఎలిమినేట్ చేయాలని గ్లోబో టీవీ ఛానల్ కు సూచించారు.


Click it and Unblock the Notifications











