బ్రెజిల్ భామతో పూరి జగన్నాధ్ బ్యాంకాక్ లో
రవితేజ, ఇలియానా కాంబినేషన్‌లో పూరి జగన్నాథ్ తీస్తున్న చిత్రం 'దేవుడు చేసిన మనుషులు'. ఈ చిత్రంలో ఐటం సాంగ్ ని బ్రెజిల్ ముద్దుగుమ్మ 'గబ్రియేలా బెర్‌టంట్'చేస్తోంది. ప్రస్తుతం ముంబైలో మోడల్ గా చేస్తున్న ఈ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమవుతోంది. ఈ పాటను బ్యాంకాక్ లో షూట్ చేస్తున్నారు. ఇక పూరీ ఈ చిత్రాన్ని ఓ సోషియో ఫాంటసీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రం గురించి దర్శకుడు పూరి జగన్నాధ్ మాట్లాడుతూ...దేవుడున్నాడని మనస్పూర్తిగా నమ్మి ఈ సినిమా చూడండి అనే కార్డ్ వచ్చిన తర్వాత సినిమా స్టార్ అవుతుంది. హండ్రెడ్ పర్శంట్ ఎంటర్టైనర్ ఇది. నాకు రవితేజ కాంబినేషన్ లో చాలా మంచి హిట్ సినిమా అవుతుంది అన్నారు.
పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో రిలియన్స్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రెవేట్ లిమిటెడ్ బ్యానర్ భారీ చిత్రాల నిర్మాత చత్రపతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. గతంలో ఇదే టైటిల్ తో కృష్ణ, ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందింది. ఇక రవితేజ, పూరీ కాంబినేషన్ లో గతంలో ఇడియట్,అమ్మా..నాన్న..తమిళ అమ్మాయి,ఇట్లు శ్రావణి..సుబ్రమణ్యం,నేనింతే చిత్రాలు తెరకెక్కియి. వీరిద్దరి కాంబినేషన్ హిట్ కాంబినేషన్ కావటంతో ప్రాజెక్టుకు మంచి క్రేజ్ వస్తోంది. అలాగే పూరీ జగన్నాధ్ తాజా చిత్రం బిజినెస్ మెన్ కూడా సూపర్ హిట్ కావటంతో మార్కెట్లో ఈ చిత్రంపై మంచి హైప్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది.
రవితేజ సరసన ఇలియానా హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, అలీ,ఎంఎస్ నారాయణ, కోవై సరళ, సుబ్బరాజు,ఫిష్ వెంకట్, జ్యోతిరానా వంటి వారు నటిస్తున్నారు. ఫొటో గ్రఫి..శ్యామ్ కె నాయుడు, సంగీతం ..రఘు కుంచే, పాటలు..భాస్కర భట్ల, ఎడిటింగ్ ..ఎస్ ఆర్ శేఖర్. కథ,స్క్రీన్ ప్లే,మాటలు,దర్సకత్వం...పూరీ జగన్నాధ్.


Click it and Unblock the Notifications











