షాకింగ్: ఔటర్ రింగ్ రోడ్డులో రాజశేఖర్ కారు బోల్తా.. ఆయన పరిస్థితి ఎలా ఉందంటే..
Recommended Video
హీరో రాజశేఖర్ కారు ప్రమాదానికి గురయ్యారు. ఆయన ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి పల్టీ కొట్టింది. వెంటనే కారులో ఉన్నఎయిర్ బెలూన్స్ తెరుచుకోవడంతో ఆయనకు పెను ప్రమాదం తప్పింది. ఈ విషయం తెలిసి మొదట షాకైన రాజశేఖర్ ఫ్యాన్స్, ఆ తర్వాత ఆయన పరిస్థితి తెలుసుకొని ఊపిరి పీల్చుకున్నారు.

భారీ ప్రమాదం.. తృటిలో తప్పించుకొని
ఈ ప్రమాదంలో రాజశేఖర్ కాళ్లు, చేతులకు స్వల్ప గాయాలయ్యాయని ప్రాథమిక సమాచారం అందింది. భారీ ప్రమాదం నుంచి ఆయన తృటిలో తప్పించుకున్నారని, ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలుస్తోంది.

విజయవాడ నుంచి వస్తూ రామోజీ ఫిల్మ్ సిటీ దాటాక..
విజయవాడలో జరిగిన కార్యాక్రమాన్ని వెళ్లిన రాజశేఖర్.. తిరుగు ప్రయాణం చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. విజయవాడ నుంచి వస్తూ రామోజీ ఫిల్మ్ సిటీ దాటిన తరువాత నేరుగా జూబ్లీహిల్స్‌కు చేరుకునే క్రమంలో అవుటర్ రోడ్డు ఎక్కిన రాజశేఖర్ కారు ప్రమాదానికి గురైందని తెలిసింది.

ప్రమాదానికి గురైన సమయంలో కారులో రాజశేఖర్ ఒక్కరే
రాజశేఖర్ కారు ప్రమాదానికి గురైన సమయంలో కారులో ఆయన ఒక్కరే ఉన్నారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి ఆయన ఇంటికి చేరుకున్నారు. తనకు ఎటువంటి గాయాలు కాలేదని రాజశేఖర్ తెలిపారు. తాను క్షేమంగా ఉన్నట్లుగా స్పష్టం చేశారు.

క్లారిటీ ఇచ్చిన రాజశేఖర్.. ఎదురుగా వస్తున్న కారులో
క్షేమంగా ఇంటికి చేరిన రాజశేఖర్ తనకు జరిగిన ప్రమాదంపై స్పందించారు. "మంగళవారం రాత్రి రామోజీ ఫిల్మ్ సిటీ నుండి ఇంటికి వస్తుండగా ఔటర్ రింగు రోడ్డులో పెద్ద గోల్కొండ అప్పా జంక్షన్ వద్ద నా కారు ప్రమాదానికి గురైంది. అప్పుడు కారులో నేను ఒక్కడినే ఉన్నాను. ఎదురుగా వస్తున్న కారులో వారు ఆగి, నా కారు దగ్గరకు వచ్చారు. లోపల ఉన్నది నేనే అని గుర్తు పట్టి, విన్ షీల్డ్ లోనుండి బయటకు లాగారు'' అని చెప్పారు.

పోలీసులకు, కుటుంబ సబ్యులకు చెప్పా
అప్పుడు నేను వెంటనే వారి ఫోన్ తీసుకుని మొదట పోలీసులకు, తర్వాత నా కుటుంబ సభ్యులకు సమాచారం అందించాను అని రాజశేఖర్ చెప్పారు. అక్కడ నుండి వారి కారులో ఇంటికి బయలుదేరాను అని.. జీవిత, మా కుటుంబ సభ్యులు ఎదురువచ్చి, నన్ను పికప్ చేసుకున్నారని ఆయన అన్నారు. తనకు ఎటువంటి గాయాలు కాలేదని రాశేఖర్ పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











