For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బ్రేకింగ్: రష్మిక ఇంటిపై ఐటీ దాడులు.. ఆరోపణలు రావడంతో!

    |
    IT Rides On Rashmika Mandanna's House !

    ఈ మధ్యకాలంలో సినీ నటుల ఇంటిపై ఎక్కువగా ఐటీ దాడులు జరుగుతుండటం చూస్తున్నాం. మొన్నామధ్య నాగార్జున, నాని, వెంకటేష్ లాంటి బడా హీరోల ఇళ్లపై ఐటీ దాడులు చేసిన ఆఫీసర్స్.. ఇటీవలే లావణ్య త్రిపాఠి, అనసూయ, సుమ ఇళ్లపై కూడా ఐటీ రైడ్స్ చేశారు. ఇప్పుడు క్రేజీ హీరోయిన్ రష్మిక మందన్న ఇంటిపై ఐటీ ఆఫీసర్స్ దాడులు చేయడం హాట్ టాపిక్ అయింది. వివరాల్లోకి పోతే..

    భారీ రెమ్మ్యూనరేషన్.. బిజీ హీరోయిన్‌

    భారీ రెమ్మ్యూనరేషన్.. బిజీ హీరోయిన్‌

    'ఛలో' సినిమాతో సినీ ఎంట్రీ ఇచ్చిన కన్నడ బ్యూటీ రష్మిక.. 'గీతగోవిందం' సినిమాతో మంచి హిట్ అందుకుంది. ఆ తర్వాత భారీ రెమ్మ్యూనరేషన్ అందుకుంటూ స్టార్ హీరోల సరసన అవకాశాలు పట్టేస్తోంది. ప్రస్తుతం ఆమె టాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్‌గా మారింది.

    ఇంటిపై ఐటీ దాడులు.. ఫ్యాన్స్ షాక్

    ఇంటిపై ఐటీ దాడులు.. ఫ్యాన్స్ షాక్

    ఇదిలా ఉంటే కర్ణాటకలోని కొడగు జిల్లా విరాజ్‌పేటలో ఉన్న రష్మిక మందన్న సొంత ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తుండటం ఆమె అభిమానులకు షాకిస్తోంది. తనిఖీ చేస్తున్న ఐటీ శాఖ ఉద్యోగులు ఆమె ఆదాయానికి సంబంధించి లెక్కలను పరిశీలిస్తున్నారు. ఈ రోజు (జనవరి 16) ఉదయం 7 గంటల 30 నిమిషాల నుంచి ఈ సోదాలు జరుగుతున్నాయి. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

    ట్యాక్స్ కట్టడం లేదన్న ఆరోపణలు..

    ట్యాక్స్ కట్టడం లేదన్న ఆరోపణలు..

    తెలుగుతో పాటు కన్నడ చిత్రాల్లోనూ రష్మిక మందన్న సత్తా చాటుతోంది. దీంతో ఆమెకు ఆదాయం పెరిగింది. అయితే ఆమె ట్యాక్స్ కట్టడం లేదన్న ఆరోపణల నేపథ్యంలో ఈ సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. సినీ సెలబ్రిటీలే లక్ష్యంగా ఐటీ శాఖ దాడులు చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది.

    సరిలేరు నీకెవ్వరు.. రష్మిక మందన్న

    సరిలేరు నీకెవ్వరు.. రష్మిక మందన్న

    మహేష్ బాబు హీరోగా రూపొందిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. అలాగే అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో రాబోతున్న సినిమాలో రష్మిక నటించనుంది. మరోవైపు నితిన్‌తో కలిసి ఆమె చేసిన 'భీష్మ' రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఈ పరిస్థితుల్లో ఆమె ఇంటిపై ఐటీ దాడులు జరగడం జనాల్లో హాట్ ఇష్యూగా మారింది.

    English summary
    Young heroine Rashmika Mandanna josh continues in tollywood. Now IT officers ride her home and checking bank details, IT forms.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more
    X