బ్రేకింగ్: ఫిల్మ్‌ఛాంబర్ ఎదుట యువ హీరో ఆందోళన.. ఆత్మహత్యాయత్నం.. రచ్చ రచ్చ

హైదరాబాద్ లోని ఫిల్మ్‌ఛాంబర్ ఎదుట ఓ యువ హీరో ఆందోళనకు దిగాడు. తన సినిమా యూట్యూబ్‌లో లీక్ అయ్యిందని తీవ్రంగా కలత చెందిన ఆ హీరో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన అక్కడి జనం ఆయన్ను ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఇంతకీ ఎవరా హీరో.. వివరాల్లోకి పోతే..

యువ హీరో ఆత్మహత్యాయత్నం

యువ హీరో ఆత్మహత్యాయత్నం

‘నానిగాడు' సినిమా హీరో దుర్గా ప్రసాద్ ఆత్మహత్యకు పాల్పడటం సినీ వర్గాలను షాక్‌కి గురిచేసింది. తన సినిమా యూట్యూబ్‌లో ప్రసారం కావడం గమనించిన ఆయన తీవ్ర ఆవేదన చెంది ఆత్మహత్యకు పాల్పడ్డట్టు సమాచారం. ఫిలింఛాంబర్ ఎదుట అందరూ చూస్తుండగానే ఆయన పురుగుల మందు తాగారని తెలుస్తోంది.

అప్రమత్తమైన స్థానికులు వెంటనే..

అప్రమత్తమైన స్థానికులు వెంటనే..

దుర్గా ప్రసాద్ పురుగులమందు తాగడం చూసిన స్థానికులు వెంటనే అప్రమత్తమై ఆయన్ను హాస్పిటల్‌కు తరలించారు. యూట్యూబ్‌లో సినిమా రిలీజ్ కావడంపై ‘నానిగాడు' చిత్రబృందం మంగళవారం ఫిలిం ఛాంబర్ ముందు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. యూ ట్యూబ్ నుంచి ఆ లింక్ తొలగించకుంటే అందరం ఆత్మహత్య చేసుకుంటానమని హెచ్చరించారు.

40 లక్షలు పెట్టాం.. సెన్సార్ బోర్డు

40 లక్షలు పెట్టాం.. సెన్సార్ బోర్డు

40 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి తీసిన తమ సినిమా 'నానిగాడు'కు సెన్సార్ బోర్డు ‘U' సర్టిఫికేట్ ఇచ్చిందని, త్వరలో విడుదలకు సన్నాహాలు చేస్తుంటే ఇలా య్యూట్యూబ్‌లో పెట్టేయడం చూసి షాకయ్యామని 'నానిగాడు' యూనిట్ వాపోతోంది.

Recommended Video

CineBox: Mahesh Babu To Play Gangster | 90ML Movie Review | Disco Raja Teaser Review
 మంగళవారం హెచ్చరిక.. నేడు ఇలా

మంగళవారం హెచ్చరిక.. నేడు ఇలా

వెంటనే యూ ట్యూబ్ నుంచి నానిగాడు సినిమా లింకులు తొలగించాలని డిమాండ్ చేసిన 'నానిగాడు' యూనిట్ సభ్యులు తీవ్ర ఆందోళన చేపట్టడం హాట్ టాపిక్ అయింది. ఈ మేరకు మంగళవారం హెచ్చరించినట్లుగానే ఈ రోజు (బుధవారం) ఆత్మహత్యకు పాల్పడ్డాడు నానిగాడు హీరో దుర్గా ప్రసాద్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X