షాకింగ్ న్యూస్: ఛానెల్ స్టింగ్ ఆపరేషన్...బ్లాక్ మనీ స్కామ్ లో దొరికిపోయిన నటులు
ముంబై: సినిమా పరిశ్రమలో రెమ్యునేషన్స్ కొంత మొత్తం బ్లాక్ లోనూ , మిగతాది వైట్ లోనూ తీసుకోవటం సహజంగా జరుగతూనే ఉంటుంది. అంది అందరికీ తెలిసిన బహిరంగ సత్యమే. అయితే మొన్న ప్రధాని ప్రకటన తర్వాత బ్లాక్ తీసుకోవటానికి ఎవరూ ఆసక్తి చూపటం లేదని చెప్తున్నారు. అయితే అది నిజమా కాదా అని తెలుసుకోవటానికి నెట్ వర్క్ 18 అనే మీడియా గ్రూప్ వాళ్లు స్టింగ్ ఆపరేషన్ నిర్వహించారు.
అయితే ఇదేమి టాలీవుడ్ లోకాదండోయ్. బాలీవుడ్ లో అదీ ముఖ్యంగా పాకిస్దాన్ నటులుపై. ఈ స్టింగ్ ఆపరేషన్‌లో వారు కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు. ఏ దిల్ హై ముష్కిల్ లో నటించిన పాకిస్దాన్ నటులు ఫవాద్ ఖాన్, ఇమ్రాన్ అబ్బాస్ నక్వి ల మేనేజర్ల వద్దకు ఓ ఈవెంట్ కి చెందిన కస్టమర్‌లా వెళ్ళిన మీడియా ప్రతినిధి వారి ధైర్యానికి ఆశ్చర్యుపోయారట.
ఫవాద్, ఇమ్రాన్ ల మేనేజర్లు తమ పేమెంట్స్ ని బ్లాక్ మరియు వైట్ లో డిమాండ్ చేసారట. రెండు గంటలు పాటు సాగే ఈవెంట్ లో పాల్గొనటానికి మంచి మొత్తమే డిమాండ్ తాము వైట్ ని పేపర్లు పై చూపెడతామని, మిగిలిన బ్లాక్ మనీ టాక్స్ కట్టకుండా తమ జేబుల్లోకి వెళ్తుందని చెప్పారట.

ఈ స్టింగ్ ఆపరేషన్ లో ఫవాద్ మేనేజర్ 50 లక్షలు రూపాయలు డిమాండ్ చేసారు. అదీ బ్లాక్ అండ్ వైట్ లో మాత్రమే ఇవ్వాలని కండీషన్ పెట్టారు. బ్లాక్ మనీ...ఇరవై ఐదు శాతం ఉండాలని, మిగిలిన సొమ్ముని లీగల్ గా అరబ్ కంట్రీస్ లో ఉన్న ఫవాద్ ఎక్కౌంట్ లో వేయాలని సూచించారట.
మరో నటుడు ఇమ్రాన్ అబ్బాస్ మేనేజర్ అయితే ఈ పోగ్రామ్ కు 35 లక్షలు అడిగారు. అందులో 32 లక్షలు బ్లాక్ లో కావాలని, మూడు లక్షలు మాత్రమే వైట్లోకావాలని అడిగాడట. ఇవన్నీ విన్న మీడియా సంస్ద వారు ఆశ్చపోయారు.
దేశంలో భారీ ఎత్తున బ్లాక్ మనీ విషయమై చర్చ జరుగుతున్న సమయంలో ఇంకా బ్లాక్ కావాలని అడగటం ఏమిటా అంటున్నారు. ఇలా చేయటం మన దేశ చట్టాలను గౌరవించకపోవటమే అంటున్నారు. ఇక మన దేశ నటులు ఏం చేస్తున్నారో తెలియాలంటే ..వారి మీద కూడా ఇలాంటి స్టింగ్ ఆపరేషన్ జరిగితేనే విషయాలు బయిటకు వస్తాయి.


Click it and Unblock the Notifications











