ఫైట్ మాస్టర్ హత్య అంటూ..
బంజారాహిల్స్ :ఫిలిం ఛాంబర్ వద్ద ఫైట్ మాస్టర్ హత్యకు గురిఅయ్యారని నిన్న(బుధవారం) సాయింత్రం ఓ ప్రముఖ ఛానెల్ లో వచ్చిన బ్రేకింగ్ న్యూస్ జూబ్లిహిల్స్ లో సంచలనం అయింది. బుధవారం మధ్యాహ్నం ఛాంబర్ వద్ద జరిగిన ఘటనలో యువ ఫైటర్ హత్యకు గురి అయ్యాడని స్క్రోలింగ్ రావటంతో మీడియా ప్రతినిధులతో పాటు ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు అక్కడకు చేరుకున్నారు. అయితే అప్పటికే అక్కడకి పోలీసులు చేరుకుని అక్కడ అలాంటి సంఘటనేమీ జరగలేదని తేల్చారు. తప్పుడు సమాచారం ప్రచారం అవుతోందంటూ పోలీసులు మండిపడ్డారు. ఇటీవల ఇది రెండో తప్పుడు సమాచారం అంటూ సదరు ఛానెల్ పై మిగిలిన మీడియా ప్రతినిధులు రుసరుసలాడటం చాలా మందిని ఆకర్షించింది. అయితే ఇదంతా జరగటానికి కారణం వార్త తొందరగా అందించాలన్న తపనతో ఛానెల్స్ వారు ఆ సంఘటన జరిగిందో లేదో నన్న ఎంక్వైరీ జరపకుండానే బ్రేకింగ్ న్యూస్ వేయటమేనని మీడియా విశ్లేషకులు వివరిస్తున్నారు.


Click it and Unblock the Notifications











