బాలీవుడ్ మూవీలో సాంగేసుకున్న క్రికెటర్ బెట్ లీ (ఫోటో)

By Bojja Kumar

హైదరాబాద్: ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ....‘అన్‌ఇండియన్‌' అనే బాలీవుడ్ చిత్రం ద్వారా నటుడిగా పరిచయం అవుతున్నాడు. మొన్నటి వరకు వరల్డ్ కప్ క్రికెట్ కామెంటేటర్ గా బిజీగా గడిపిన బ్రెట్ లీ తాజాగా ఈ బాలీవుడ్ చిత్రం షూటింగులో పాల్గొన్నాడు. అతనిపై పాట చిత్రీకరణ పూర్తయింది.

ఈ పాటలో బ్రెట్ లీ ఇండియన్ సాంప్రదాయ దుస్తుల్లో కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో ఆయన సరసన తన్నిష్టా చటర్జీ నటిస్తున్నారు. ఇదో క్రాస్ కల్చర్ మూవీ. భారత్, ఆస్ట్రేలియా సాంప్రదాయాల మేళవింపుతో ఈ సినిమా సాగుతుంది. భర్త చనిపోయిన ఇండియన్ మహిళతో ప్రేమలో పడే టీచర్ గా బ్రెట్ లీ నటిస్తున్నాడు.

Brett Lee Wraps Up Movie Shoot With Dance Sequence

బ్రెట్ లీ నటిస్తున్న నేపథ్యంలో ఈ చిత్రంపై ఇటు సినీ అభిమానులు, అటు క్రికెట్ అభిమానులు ఆసక్తి చూపుతారని భావిస్తున్నారు. ఈ చిత్రానికి అనుపమ్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. తష్టీ సతీ ఈ చిత్రానికి కథ అందించారు. దేవేందర్ గుప్తా సమర్ఫణలో అనుపమ్ శర్మ లీసా డఫ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X