'బృందావనం' అర్ద శతదినోత్సవం నిజామాబాద్ లో ఎందుకంటే...
ఎన్టీఆర్ హీరోగా చేసిన "బృందావనం" చిత్రం నైజాంలో టాప్ ఫైవ్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలబడిందని దిల్ రాజు చెప్తున్నారు. అందుకే నిజామాబాద్ లో ఈ చిత్రం యాభై రోజుల పంక్షన్ కి ఏర్పాటు చేస్తున్నామని చెప్తున్నారు. ఎన్టీఆర్ కూడా ఈ పంక్షన్ లో పాల్గొనటానికి ఒప్పుకున్నారని తెలిపారు. ఇక బృందావనం చిత్రం నైజాం ఏర్పాటు చేయటానికి కారణం దిల్ రాజు, దర్శకుడు వంశీ పైడిపల్లి తెలంగాణా ప్రాంతానికే చెందిన వారు కావటమే కాకుండా ఆ ప్రాంతాల్లో ఎన్టీఆర్ తన సినిమాలకు భవిష్యత్ లో సమస్యలు రాకుండా చూసుకునేందుకు కూడా నిజామాబాద్ ని ఎన్నుకున్నట్లు చెప్తున్నారు. చాలా చోట్ల కలెక్షన్స్ డ్రాప్ అవటంతో ఈ చిత్రం ప్రమోషన్ కోసం త్వరలో మీడియాతో కలిసి కొన్ని ఛానెల్స్ లో ప్రత్యేక పోగ్రాములకు కూడా దిల్ రాజు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.ఇక రీసెంట్ గానే బృందావనం చిత్రం ఆడియో ప్లాటినం డిస్క్ వేడుక హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో జరిపారు. ఈ వేడుకకు దర్శకులు రాజమౌళి, వీవీ వినాయక్ ముఖ్య అతిధులుగా విచ్చేసి చిత్రం నటీనటులకు, సాంకేతిక నిపుణులకు షీల్డ్ లను అందజేశారు.


Click it and Unblock the Notifications











