'బొమ్మరిల్లు'ని ఖచ్చితంగా దాటిపోతుంది...దిల్ రాజు
మా సంస్థలో ఇప్పటివరకూ టాప్ ఫిల్మ్ 'బొమ్మరిల్లు'. 'బృందావనం' దాన్ని కచ్చితంగా అధిగమిస్తుంది. ఎన్టీఆర్‌కూ, మా బ్యానర్‌కూ ఇది ప్రత్యేకమైన సినిమా అవుతుంది. అయితే ఎన్టీఆర్ వంటి స్టార్ ఉన్న ఈ సినిమా ఏ రేంజి సినిమా అవుతుందో మాత్రం చెప్పలేను. ఈ సినిమాకి కథే బలం. ఆ కథకి ఎన్టీఆర్ అతికినట్లు సరిపోయారు. ఈ తరహా పాత్ర చేయడం ఆయనకి ఇదే తొలిసారి. క్లాస్, మాస్ తేడా లేకుండా ప్రతి ఒక్కరూ చూసే సినిమా" అని దిల్ రాజు చెప్పారు.ప్రసాద్ ల్యాబ్స్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అలాగే.. "ఇటీవల విడుదల చేసిన ఆడియోకు మంచి స్పందన లభించింది. మా బ్యానర్‌లో ఓ స్టార్ హీరోతో సినిమా చెయ్యాలనే కోరిక 'బృందావనం'తో తీరింది అన్నారు. అక్టోబర్ 8న విడుదల కానున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు..వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్టీఆర్ సరసన కాజల్, సమంత హీరోయిన్స్ గా చేస్తున్నారు. ఇక ప్రస్తుతం సినిమా సెకండాఫ్‌కి రీరికార్డింగ్ జరుగుతోంది. ఈ చిత్రానికి ఫైట్స్: రామ్-లక్ష్మణ్, పీటర్ హెయిన్స్, కళ: ఆనందసాయి, సహ నిర్మాతలు: శిరీశ్, లక్ష్మణ్.


Click it and Unblock the Notifications











