ఇంతకీ ఎన్టీఆర్ 'బృందావనం' ఫైనల్ గా రిజల్ట్ ఏమిటి?
"నాకు చాలా ఆనందంగా ఉంది. ఇండస్ట్రీలో ప్రతీ ఒక్కరూ నా కెరీర్ లో "బృందావనం" పెద్ద హిట్ అంటున్నారు" అంటూ ట్విట్టర్ లో రాసి మురిసిపోతున్నారు ఎన్టీఆర్. ఆయన తన తాజా చిత్రం బృందావనం చిత్రం ఘన విజయం సాధిస్తుందని మొదటినుంచీ నమ్మకంగా ఉన్నారు. ముఖ్యంగా ఈ చిత్రంతో ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేసే వీలుంటుందని ఆయన బావించారు. అందుకు తగినట్లుగానే ధియోటర్స్ వద్ద మహిళలు కనపడటం ఆనందాన్ని కలిగించే అంశం. అయితే ఇండస్ట్రీ చెప్పుకున్నంతగా బయిట టాక్ వినపడటం లేదు. యావరేజ్ చిత్రం అని చాలామంది చెప్పటం జరుగుతోంది. దర్శకుడు వంశీ పైడిపల్లి పాత కథనే తీసుకుని నలిగిపోయిన సీన్స్ తో దానిని నడిపించే ప్రయత్నం చేయటంతో సినిమా అభిమానులకు ఆసించిన కిక్ ఇవ్వటం లేదంటున్నారు. అయితే ఎన్టీఆర్ మాత్రం తన శక్తిమేరకు సినిమాను ఒంటి చేత్తే నడిపించే ప్రయత్నం చేసాడని అంటున్నారు. మరో ప్రక్క ఖలేజా బరిలోంచి తప్పుకోవటం కొంత వరకూ ప్లస్ అయినా రోబో హవా మాత్రం తగ్గకపోవటం బృందావనానికి ప్రతికూలాంశమే.


Click it and Unblock the Notifications











