ప్రిన్స్ మహేష్ సెంటిమెంట్ ను దెబ్బకొడుతున్న జూ ఎన్టీఆర్..!
అందరం అనుకున్నట్టుగానే కొమరం పులి సినిమా విడుదలైంది. అంచనాలను అందుకోలేక చతికిల పడ్డవిషయం కూడా తెలిసిపోయింది. ఆదివారం జూ ఎన్టీఆర్ బృందావనం ఆడియో అట్టహాసంగా శిల్పకళావేదిక లో విడుదలైంది. ఇక మహేష్ బాబు ఖలేజా ఆడియో కూడా విడుదలకు సిద్దంగా ఉంది. దీని తరువాయి వీరిద్దరి సినిమాలు విడుదలై బాక్సాఫీస్ బరిలో దిగబోతున్నారు. జూ ఎన్టీఆర్ బృందావనం, మహేష్ బాబు ఖలేజా ఒకేసారి విడుదలయ్యే అవకాశాలు ఉండడంతో ఇరువర్గాల అభిమానల్లో ఉత్కంఠ నెలకోంది. తమ హీరో సినిమా సూపర్ హిట్ అంటే తమ హీరో సినిమా సూపర్ హిట్ అంటూ ఇప్పుడే పోటీపడుతున్నారు. ఐతే ఈ తరుణంలో మహేష్ బాబు అభిమానులు కోంచం డీలా పడిపోయారు. దానికి కారణం మహేష్ బాబుకి బాగా కలసివచ్చిన హైదరాబాద్ లోని సుదర్శన్ 35 ఎం ఎం థియేటర్ ను ఈ సారి ఎన్టీఆర్ తన బృందావనం సినిమా కోసం ముందుగానే బుక్ చేసుకున్నారట. దానికి కారణం ఈ సుదర్శన్ 35 ఎం ఎం థియేటర్ లో మహేష్ బాబు మురారి, ఒక్కడు, అతడు, పోకిరి సినిమాలు 175 రోజులు ఆడి ఆల్ టైమ్ రికార్డులు సృష్టించాయి. అంతేకాకుండా నాలుగు జూబ్లీలున్న హీరోగా మహేష్ బాబు పేరు చరిత్రలో నిలిచిపోయింది. అలాంటి థియేటర్ లో తన సినిమా కూడా సిల్వర్ జూబ్లీ జరుపుకోవాలని ఉద్దేశ్యంతో ఇలాచేశారని వినికిడి. కాని మహేష్ బాబు అభిమానులు మాత్రం ఖలేజాని కూడా ఇక్కడే ఆడించాలని అనుకోవడం, సడన్ గా ఈ మార్పు జరగడం వారికి రుచించలేదు. అంతేకాకుండా ఖలేజా సినిమాని దేవి థియేటర్ లో విడుదల చేస్తున్నట్టు వార్తలు రావడంతో మహేష్ బాబు అభిమానులు ఇంకా నిరాశకు గురిఅవుతున్నారు. దానికి కారణం ఈ థియేటర్ లో మహేష్ బాబు టక్కరిదోంగ, నిజం సినిమాలను విడుదల చేశారు. ఈ రెండు సినిమాలు ఎంత బాగా ఆడాయో మన అందరికి బాగా తెలుసు. ఈ సారి ఎన్టీఆర్ బృందావనం దెబ్బని మహేష్ బాబు ఖలేజా ఏవిధంగా ఎదుర్కోంటాడో తెలియాలంటే సినిమాలు వచ్చేవరకు ఆగాల్సిందే..


Click it and Unblock the Notifications











