»   » జూ ఎన్టీఆర్ 'బృందావనం' రిలీజ్ డేటే ఎప్పుడంటే?

జూ ఎన్టీఆర్ 'బృందావనం' రిలీజ్ డేటే ఎప్పుడంటే?

Posted By:
Subscribe to Filmibeat Telugu

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా దిల్ రాజు నిర్మిస్తున్న 'బృందావనం' చిత్రం ఆగస్టు 15న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు దిల్ రాజు...ఎన్టీఆర్ తో చర్చించినట్లు తెలుస్తోంది. ఇక అదే రోజున ఎన్టీఆర్ హీరోగా చేసిన 'యమదొంగ' రిలీజైంది. రాజమౌళి రూపొందించిన ఈ చిత్రం వరస ఫ్లాఫ్ ల్లో ఉన్న ఎన్టీఆర్ ని నిలబెట్టింది. దాంతో ఆగస్టు 15న ఎన్టీఆర్ ప్రత్యేకమైన రోజుగా పరిగణిస్తారు. అందులోనూ ఆ రోజు స్వాతంత్ర్య దినోత్సవం కూడా కావటంతో ఆ డేట్ నే ఫిక్స్ చేసినట్లు చెప్తున్నారు. కాజల్, సమంతా హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ లవర్ బోయ్ గా కనిపించనున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్ అవుట్ స్కర్ట్స్ లో ప్రత్యేకంగా వేసిన సెట్ లో ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది. ఈ షెడ్యూల్ అనంతరం కర్నాటకలోనూ, కేరళలోనూ షూటింగ్ జరగనుంది. మరో ప్రక్క ఎన్టీఆర్, మెహర్ రమేష్ కాంబినేషన్ లో అశ్వనీదత్ నిర్మిస్తున్న 'శక్తి' చిత్రం షూటింగ్ జరుగుతోంది. ఈ డైరక్టర్స్ ఇద్దరూ ఇంతకు ముందు ప్రభాస్ తో సినిమా చేసి (మున్నా,బిల్లా) ప్రస్తుతం ఎన్టీఆర్ తో చేస్తున్న వారే కావటం విశేషం.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu