'బృందావనం' రిలీజ్ ఎన్ని ధియోటర్స్? ఎన్ని ప్రింట్లు?
ఎన్టీఆర్ తాజా చిత్రం "బృందావనం" ఈ రోజు రిలీజవుతోంది. ఈ చిత్రం 521 ప్రింట్లతో 726 ధియోటర్స్ లలో భారీగా విడుదల చేస్తున్నారు. కాజల్,సమంత హీరోయిన్స్ గా చేసిన ఈ చిత్రం ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని దిల్ రాజు చెప్తున్నారు. ఇక ఎన్టీఆర్ ఈ చిత్రం గురించి చెబుతూ...దర్శకుడు వంశీ పైడిపల్లి పెయింటింగ్‌లా ఈ చిత్రాన్ని తీశాడు అతినిలో అద్భుతమైన దర్శకుడిగా తయారయ్యే లక్షణాలు అతనిలో కనిపిస్తు న్నాయి. చెప్పిన కథ కన్నా బాగా తీశాడు. ప్రతి ఫ్రేమ్‌ని ఒక పెయింటిం గ్‌లా, చాలా అందంగా తీశాడు.
'బ్యూటిఫుల్ పిక్చరైజేషన్ ' అంటారే - అది 'బృందావనం'లో అడుగడుగునా కనిపిస్తుంది. నా వరకు అయితే వందకి వంద మార్కులు కొట్టేశాడు. 'మున్నా' రూపంలో అతని తొలి ప్రయత్నం ఫలించలేదంతే. అతను ఫ్లాప్ కాదు. 'మున్నా' స్క్రిప్టు ఫ్లాపయ్యిందేమో కానీ డైరెక్టర్‌గా పాసయ్యాడు. చాలా స్టైలిష్‌గా ఆ సినిమాని తీశాడు. అలాంటి డైరెక్టర్ మంచి కథ చేస్తే ఎలా ఉంటుందనేదానికి 'బృందావనం' ఒక నిదర్శనం. అంత బలమైన కథ ఇది అంటూ దర్శకుడుపై తనకున్న నమ్మకాన్ని ఎన్టీఆర్ చెప్తున్నారు. మరికొద్ది సేపటిలో ఆయన నమ్మకం ఏ మేరకు ఫలించిందనేది ప్రేక్షకులు చూస్తారు.


Click it and Unblock the Notifications











