»   » రవితేజ సినిమాకు ఆమె 2 కోట్లు డిమాండ్ చేస్తోందట!

రవితేజ సినిమాకు ఆమె 2 కోట్లు డిమాండ్ చేస్తోందట!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రవితేజ హీరోగా కొత్త దర్శకుడు చక్రి తెరకెక్కించే సినిమాలో బ్రిటిష్ బ్యూటీ అమీ జాక్సన్ హీరోయిన్ చేసే అవకాశం ఉందని ఆ మధ్య వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ఆమెను సంప్రదించి డేట్స్ తీసుకునేందుకు ఓ ఏజెన్సీ ద్వారా నిర్మాత కెఎల్ దామోదర ప్రసాద్ అప్రోచ్ అయినట్లు తెలుస్తోంది.

అయితే ఈ సినిమా కోసం అమీ జాక్సన్ చెప్పిన రేటు చూసి నిర్మాత షాక్ అయ్యాడట. రూ. 2 కోట్లు ఇస్తేనే సినిమా చేస్తానని సదరు ఆమె ఏజెన్సీ ద్వారా పంపిన సందేశం విని నిర్మాత కళ్లు బైర్లుకమ్మాయట. అంత భరించడం తన వల్ల కాదంటూ నిర్మాత హీరోయిన్ విషయంలో తన నిర్ణయం మార్చుకున్నట్లు తెలుస్తోంది.

British girl Amy Jackson demands 2 cr

గతంలో రామ్ చరణ్ సరసన ‘ఎవడు' మూవీలో నటించిన అమీ జాక్సన్ కేవలం 25 లక్షలు మాత్రమే చార్జ్ చేసింది. అయితే ఆ తర్వాత అమీ జాక్సన్ శంకర్ సినిమా ‘ఐ'లో అవకాశం దక్కించుకోవడంతో డిమాండ్ పెరిగింది. ఇపుడు ‘రోబో-2'లో కూడా హీరోయిన్ గా బుక్ కావడంతో అమ్మడు రేటు సాధారణ నిర్మాతలు అందుకోలేనంత ఎత్తులోకి వెళ్లి పోయింది.

ప్రస్తుతం అమీ జాక్సన్ సౌత్ సినిమాలకే పరిమితం అయింది. అయితే బాలీవుడ్లో అవకాశాలు పెంచుకోవడానికి ప్రయత్నిస్తోంది. శంకర్ దర్శకత్వంలో వచ్చే ‘రోబో-2' కూడా హిట్టయితే అమీ జాక్సన్ స్టార్ హీరోయిన్ గా మారడం ఖాయం అంటున్నారు.

English summary
As per reports, when producer KL Damodara Prasad approached heroine Amy, through her agency, the actress quoted 2 crores remuneration. When she acted in Yevadu, she has charged 25 lakhs and her enormous demand could be attributed to films like Robo 2 in hand.
Please Wait while comments are loading...