ఆమె సెక్స్ లైఫ్ పై ఆరు నెలలు నిషేధం

By Staff

Britney Spears
తల్లి తండ్రులు తమ బిడ్డలు సుఖంగా ఉండాలి..వారి సెక్స్ జీవితం హ్యాపీగా ఉండాలని కోరుకుంటూంటారు. అయితే ప్రముఖ పాప్ గాయిని బ్రిట్నీ స్పియర్ తల్లి తండ్రులు మాత్రం దీనికి విరుద్దంగా బిహేవ్ చేయ్యాల్సిన పరిస్ధితులు ఎదుర్కొంటున్నారు. తమ కూతురుని ఆరు నెలలపాటు సెక్స్ కి దూరంగా ఉంచాలని వారు నిర్ణయించారు.


ఓ ప్రక్క బ్రిట్నీ స్పియర్ అనారోగ్యం నుండి త్వరితంగా కోలుకున్నందుకు సంతోషిస్తున్న స్పియర్స్ దంపతులు ఆమె పాత ప్రియుడు అద్నాన్ గాలిబ్ వంటి వ్యక్తులతో ఆమె డేటింగ్‌కు దిగకుండా చేయాలని భావిస్తున్నారు. పాపరాజ్జీగా -ఫోటోగ్రాఫర్- ఉన్న ఆమె మాజీ ప్రియుడు అద్నాన్ చివరకు ఆమెతో తను గడిపిన సెక్స్ క్షణాలను సైతం రికార్డు చేసి ఇటీవల దానిని అమ్మేందుకు ప్రయత్నించిన విషయం తెలిసిందే. అసలు బ్రీట్నీ పబ్లిక్ లైఫ్ కుప్పకూలిపోయేందుకు ఆమె మాజీ ప్రియుడు ఆద్నాన్ గాలిబ్ పాక్షికంగా కారకుడు అని ఆమె తల్లిదండ్రులు భావిస్తున్నారు.

పూర్తిగా మానసికోన్మాద స్థితి ఆవరించిన బ్రీట్నీకి సహాయపడేందుకోసం ఆమె వ్యక్తిగత, వృత్తిపర వ్యవహారాలను స్పియర్స్ దంపతులు ఈ సంవత్సరం మొదట్లో తమ అదుపులోకి తీసుకున్నారు. మగవాళ్ళ ఎంపికలో కూతురు వేస్తున్న తప్పటడుగులకు భయపడిన స్పియర్ దంపతులు ఆమె మళ్లీ తప్పుడు మనుషులతో సంబంధాల్లోకి వెళితే ఆమె ఆరోగ్య స్థితి కుప్పగూలుతుందని ఏమౌతుందోనని భయపడుతున్నారు.

అలాగే ఆ ఫోటోగ్రాఫర్‌తోను, అతడి మేనేజర్ శామ్ లుట్ఫి చుట్టూతా తిరుగుతున్నంత సేపు తమ కూతురు తమకు ఇక దక్కదనే భావించినట్లుగా స్పియర్ దంపతులు మీడియాతో చెప్పారు. తమ కూతురు మళ్లీ ప్రజాజీవితంలో స్థిరపడే క్షణాలు సమీపిస్తున్నందున ఆమె దారికి ఎలాంటి అడ్డు ఎదురుకావడం వారికి ఇష్టం లేదని డెయిలీ టెలిగ్రాఫ్ పేర్కొంది. అంతేగాక బ్రిట్నీ తన కొద్దిపాటి జీవితంలో ఎదుర్కొన్న భయంకర రాత్రులు తిరిగి ఆమెకు ఎదురు కాకూడదని వారు భయపడుతున్నారు.

ఆమె తల్లిదండ్రులు జామీ, లిన్ స్పియర్స్‌లు ఇలా డబ్బుకోసం లేదా తమ స్వంత కెరీర్ కోసం తనను ఉపయోగించుకోవడానికి ప్రయత్నించిన వారితో సంబంధంలోకి వెళ్లడమే బ్రీట్నీ కొంప ముంచిందని స్పియర్ దంపతులు నమ్ముతున్నారు.అందుకు వారిని దూరంగా పెట్టడమే పరిష్కారం గా బావించి...ఆరునెలల పాటు కూతురు సెక్స్ జీవితం గడపకుండా అదుపులో ఉంచాలని తల్లిదండ్రులు భావిస్తున్నట్లుగా ఆ పత్రిక పేర్కొనొంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X