Bro పెద్ద స్కామ్.. ఎవడికీ ఆ హక్కు లేదు.. మంత్రి ఆరోపణలపై బ్రో నిర్మాత కామెంట్స్

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో బేబి సినిమా కలెక్షన్ల హవా కొనసాగిస్తుంటే.. పవన్ కల్యాణ్ బ్రో మూవీ మాత్రం వివాదాలతో ముందుకు పోతోంది. జూలై 28న విడుదలైన బ్రో సినిమాలో ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబును కించపరిచేవిధంగా శ్యాంబాబు అనే పాత్రను క్రియేట్ చేశారని ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై వాదనలు, ప్రతివాదనలు కొనసాగుతూనే ఉన్నాయి. బ్రో సినిమాకు బ్లాక్ మనీ ఉపయోగించారని, పవన్ కల్యాణ్ కు రెమ్యునరేషన్ రూపంలో టీడీపీ ముడుపులు అందినట్లుగా అంబటి రాంబాబు విమర్శలు చేశారు. దీనిపై తాజాగా బ్రో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ రియాక్ట్ అయ్యారు.

పొంతన లేదు:"మేం ప్రొడక్షన్ లోకి వచ్చి ఐదేళ్లు అవుతుంది. ఇది (బ్రో) 25వ సినిమా. మేము విడుదల చేసిన వాటిలో ఇది భారీ చిత్రం. దీనికి నెట్ ఫ్లిక్స్ తో పాటు జీ టీవీతో ఎక్స్ ట్రార్డినరీ నాన్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. పవన్ కల్యాణ్ రేంజ్ కి తగినట్లుగా అన్ని ఏరియాకు సేల్ చేయగలిగాం. ఆయన (అంబటి రాంబాబు) నోటికొచ్చినట్లు మాట అనడమే కానీ, దీనికి దానికి పొంతనే లేదు" అని టీజీ విశ్వప్రసాద్ తెలిపారు.

Bro Producer TG Vishwa Prasad Reacts To Minister Ambati Rambabu Comments

స్పష్టంగా తెలుసు:"మేము ఏదైతే బయట నుంచి డబ్బు తెస్తామో ప్రాపర్ ఆర్బీఐకి రిపోర్ట్ చేసే తీసుకొస్తాం. లోకల్ గా జెనరేట్ అయినా రెవిన్యూ లోకల్ గా వస్తుంది. ఏజెన్సీ వస్తే మీరు నేను కాదు. ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఒకరికి అవసరం లేని ఆన్సర్ నేను ఇవ్వాలనుకోవట్లేదు. ఈ సినిమాకు ఎంత అయిందేనిది మాకు, జీటీవికి క్లియర్ గా తెలుసు. మా ఇద్దరికి తప్పితే ఈ ప్రపంచంలో ఎవరికీ చెప్పాల్సిన పనిలేదు" అని బ్రో నిర్మాత పేర్కొన్నారు.

Bro Producer TG Vishwa Prasad Reacts To Minister Ambati Rambabu Comments

పుకార్లు ఎలాగైనా ఉంటాయి:"మా కంపెనికీ, కల్యాణ్ గారికి ఉన్న అగ్రిమెంట్ అడిగే హక్కు ప్రపంచంలో ఎవడికి లేదు. ఆయన ఇన్ కమ్ ట్యాక్స్ రిపోర్ట్ చేసుకునేటప్పుడు ఆయన చేసుకుంటారు. మా లెక్కలు మేము చూపిస్తాం. మాకు వచ్చిన అమౌంట్ కు జీఎస్టీ రిపోర్ట్ చేస్తాం. దీనికి మించి ఎవరికి కూడా అడిగే అధికారం లేదు. నాకు చెప్పే అవసరం లేదు. పుకార్లు అనేవి ఎలాగైనా ఉండొచ్చు. ఎలాగైనా వస్తాయి" అని టీజీ విశ్వప్రసాద్ చెప్పుకొచ్చారు.

Bro Producer TG Vishwa Prasad Reacts To Minister Ambati Rambabu Comments

బయటకు చెప్పం:"మేము, జీ టీవి కలిసి నిర్మించిన సినిమా ఇది. పవన్ కల్యాణ్ రేంజ్ కు తగినట్లుగా పారితోషికం ఇచ్చాం. అది ఎంత ఇచ్చాం, బయటకు చెప్పడం చెప్పకపోవడం అనేది ఆయన పర్సనల్ ఇంట్రెస్ట్. మా బిజినెస్ ఎంత అయిందనేది కొన్ని ఫోరమ్స్ లో ఉంటుంది. అక్కడ అన్ని లెక్కలు ఉంటాయి. మేం ఎంత ఖర్చు పెట్టాం అన్నది మా ఇంటర్నల్ విషయం. అది ఎప్పటికీ బయటకు చెప్పం" అని విశ్వ ప్రసాద్ అన్నారు.

రాజకీయ ఆరోపణలు:"సినిమా చేయాలన్న డిస్కషన్ హరిహర వీరమల్లు, వకీల్ సాబ్ కంటే ముందుగానే జరిగింది. కానీ అన్ని కుదరడానికి టైమ్ పడుతుంది. ఓ షెడ్యూల్, ఓ ప్లానింగ్ ఉంటుంది. అది ఫిబ్రవరిలో ఎండ్ లో 23 రోజులు దొరికాయి. మాకున్న సమయంలో కంప్లీట్ చేయగిలిగాం కాబట్టి అనుకున్న టైమ్ లో రిలీజ్ చేశాం. మిగతా సినిమాల సంగతి వేరే విషయం. అవన్నీ రాజకీయ ఆరోపణలు. వాటిని అంతగా సీరియస్ గా తీసుకోవట్లేదు. అది అనవసరమైన వాదన" అని బ్రో నిర్మాత తెలిపారు.

Bro Producer TG Vishwa Prasad Reacts To Minister Ambati Rambabu Comments

బ్రో పెద్ద స్కామ్:కాగా పవన్ కల్యాణ్ కు చంద్రబాబు ఇవ్వాల్సిన ప్యాకేజీ డబ్బును టీజీ విశ్వప్రసాద్ ద్వారా పారితోషికం రూపంలో ఇచ్చారని అంబటి రాంబాబు ఆరోపించారు. "బ్రో సినిమా పెద్ద స్కామ్. అమెరికాలోని బ్లాక్ మనీనీ వైట్ మనీగా మార్చి నిర్మించారు. 23 రోజులకు పవన్ రూ. 66 కోట్లు తీసుకున్నారా. 40 రోజులు పనిచేసి రూ. 80 కోట్లు తీసుకున్నారా. మొత్తం డబ్బుని ఇన్ కమ్ ట్యాక్స్ లో చూపించారా లేదా. నీతి నిజాయితీపరుడు, చట్టం ప్రకారం నడుచుకునే సైనికుడు అని పదే పదే చెప్పే పవన్ కల్యాణ్ ఎంత తీసుకున్నారు. ఎంత కలెక్షన్స్ వచ్చాయి" అని ప్రశ్నలు కురిపించారు మంత్రి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X