‘బ్రోచేవారెవరురా’ ట్విట్టర్ రివ్యూ: ఆడియన్స్ ఏమంటున్నారంటే..
Recommended Video
మెంటల్ మదిలో, నీది నాది ఒకే కథ లాంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీవిష్ణు తాజాగా 'బ్రోచేవారెవరురా' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. మన్యం ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కుమార్ మన్యం నిర్మించిన ఈ చిత్రంలో శ్రీవిష్ణు సరసన నివేదా థామస్ హీరోయిన్‌గా నటించగా సత్యదేవ్, నివేదా పేతురాజ్, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రలు పోషించారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించారు. టీజర్, ట్రైలర్ ఆకట్టుకునే విధంగా ఉండటంతో సినిమాపైముందు నుంచి మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఓవర్సీస్‌తో పాటు మరికొన్ని చోట్ల షోలు మొదలయ్యాయి. ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాపై ఆడియన్స్ నుంచి వ్యక్తం అవుతున్న ట్విట్టర్ రివ్యూలు పరిశీలిస్తే సినిమా హిట్టయ్యేలా ఉంది.

స్క్రీన్ మీద ప్యూర్ మ్యాజిక్ చేశాడు
ఈ చిత్రం చూస్తుంటే దర్శకుడు స్క్రీన్ మీద ప్యూర్ మ్యాజిక్ చేసినట్లు ఉంది. అప్ కమింగ్ డైరెక్టర్స్, కెమెరామెన్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ ఈ సినిమాను అస్సలు మిస్సవ్వొద్దు. ‘బ్రోచేవారెవరురా' అద్భుతంగా ఉంది అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

మంచి సినిమా
‘బ్రోచేవారెవరురా' చాలా మంచి సినిమా. స్క్రిప్టు రాసిన విధానం, తెరకెక్కించిన తీరు చాలా బావుంది. శ్రీవిష్ణు, రాహుల్ పెర్ఫార్మెన్స్ చాలా నచ్చింది. ఈ సినిమాలో మంచి వినోదం లభిస్తుంది.

ఎక్సలెంట్ ఫస్టాఫ్
‘బ్రోచేవారెవరురా' సినిమా ఫస్టాఫ్ చాలా బావుంది. కామెడీ అదిరిపోయింది. శ్రీవిష్ణు, నివేదా థామస్, ప్రియదర్శి పెర్పార్మెన్స్ చాలా బావుంది. వివేక్ సాగర్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంది.

స్లోగా ఉంది కానీ బావుంది
‘బ్రోచేవారెవరురా' సినిమా కాస్త స్లోగా ఉంది కానీ బావుంది. అందరూ బాగా చేశారు. బ్యాగ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంది. ఫన్ అండ్ టైమ్ పాస్ మూవీ. ఫ్రెండ్స్‌తో మాట్లాడే బూతులు సెన్సార్ లేకుండా పెట్టేశాడు.

రియల్లీ క్రేజీ మూవీ
‘బ్రోచేవారెవరురా' నిజంగా ఒక క్రేజీ మూవీ. ఈ సినిమా అస్సలు మొస్సవ్వొద్దు. చాలా వినోదం లభిస్తుంది. థియేటర్లో పగలబడి నవ్వుకోవచ్చు. వివేక్ ఆత్రేయ దర్వకత్వం సూపర్ అనేలా ఉంది. స్ట్రాంగ్ స్క్రిప్ట్, స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్.

నవ్వించే సినిమా
‘బ్రోచేవారెవరురా' ప్రతి ఒక్కరినీ నవ్విస్తుంది. సినిమా కథ చాలా నేచురల్‌గా ఉంది. థియేటర్లో నవ్వులు పూయడం ఖాయం. ఈ సినిమా అస్సలు మిస్సవ్వొద్దు.

ఇద్దరు మరో హిట్టు కొట్టారు
‘బ్రోచేవారెవరురా' సినిమా పూర్తి వినోదాత్మక చిత్రం. సినిమా ఆద్యంతం ఎంజాయ్ చేస్తారు. శ్రీవిష్ణు, వివేక్ ఆత్రేయ మెంటల్ మదిలో తర్వాత మరో విజయం అందుకున్నారు.

శ్రీవిష్ణు స్క్రిప్టు సెలెక్షన్ సూపర్
శ్రీవిష్ణు స్క్రిప్టు సెలక్షన్ ఎప్పుడూ సూపర్ అనేలా ఉంటుంది. ‘బ్రోచేవారెవరురా' సినిమా చాలా బావుంది. బాక్సాఫీస్ నెంబర్ల సంగతి పక్కన పెడితే టాలీవుడ్లో నాకు బాగా నచ్చిన హీరో శ్రీవిష్ణు. ఈ చిత్రంలో నివేదా థామస్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది.


Click it and Unblock the Notifications











