»   »  జగన్ బాబు, మహేష్ బాబు కలిస్తే....., నేను మెంటల్ మ్యాన్!

జగన్ బాబు, మహేష్ బాబు కలిస్తే....., నేను మెంటల్ మ్యాన్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మద్దినేని రమేష్‌ దర్శకత్వంలో పోసాని కృష్ణమురళి ప్రధాన పాత్ర పోషిస్తున్న చిత్రం 'బ్రోకర్-2'. మద్దినేని రమేష్‌, మందలపు సుధాకరరావు నిర్మాతలు. స్నేహ కథానాయిక. బెనర్జీ, జీవా, సిరిశ్రీ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం నిన్న విడుదలైంది. ఈ చిత్రంలోని పోసాని కృష్ణ మురళి చెబుతున్న పలు డైలాగులు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

Broker 2 movie news

'మహేష్ బాబు- జగన్ బాబు కలిస్తే న్యూస్ అవుతుంది. కానీ మహేష్ బాబు-వెంకటేష్ బాబు కలిస్తే ఏమవుతుంది అయితే గియితే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టవుతుంది' అనే డైలాగ్‌తో పాటు 'నేను ప్రిన్స్ మహేష్ బాబు లాంటోడిని....ఆయన జెంటిల్మెన్ నేను మెంటల్ మ్యాన్' డైలాగులు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. 'తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ మధ్య ఓ లింకు ఉంటుంది...అదే హైదరాబాద్, ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య ఓలింకు ఉంటుంది...అదే బ్రోకర్' అనే డైలాగులు ఇందులో ఉన్నాయి.

'లాభాపేక్ష లేకుండా ప్రస్తుత రాజకీయల నేపథ్యంలో ప్రేక్షకులకు మంచి సందేశం ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ఈ చిత్రం తెరకెక్కించారు. చక్కని పాటలు, డైలాగ్‌ లు కుదిరాయి. 'అవినీతిపనులు చేసేవాడు బ్రోకర్‌ కాదు. ఆ అవినీతిని కూకటివేళ్ళతో పెకటించేవాడు కూడా బ్రోకరే. అదే ఈ చిత్రంలో ఉన్నది. చక్కని కథాంశంతో నేటి రాజకీయ వ్యవస్థకు అద్దంపట్టేలా కమర్షియల్‌ అంశాలతో తెరకెక్కించారు. అయితే బాక్సాఫీసు వద్ద ఈచిత్రానికి పెద్ద స్పందన రావడం లేదు. సినిమా బోరింగ్‌గా ఉందనే టాక్ వినిపిస్తోంది. అయితే టీవీ ప్రకటనల్లో మాత్రం పై డైలాగులు ఆకట్టుకుంటున్నాయి.

English summary
Broker 2 is the sequel of the 2010 R P Patnaik film Broker. Starring Posani Krishna Murali, this political drama which is directed and produced by Maddineni Ramesh has hit the screens yesterday.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu