‘బ్రదర్ ఆఫ్ బొమ్మాళి’ ఆడియో డేట్ ఖరారు!
హైదరాబాద్: ఇ.వి.వి సత్య నారాయణ సమర్పణలో సిరి సినిమా పతాకంపై అల్లరి నరేష్-మోనాల్ గజ్జర్ జంటగా అమ్మిరాజు కానుమల్లి నిర్మిస్తున్న చిత్రం ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాళి'. అల్లరి నరేష్‌కు ట్విన్ సిస్టర్‌గా ‘రంగం' ఫేం కార్తీక నటిస్తున్న ఈ చిత్రానికి ‘వీడు తేడా' ఫేం బి.చిన్ని దర్శకుడు. శేఖర్ చంద్ర సంగీత సారథ్యం వహించిన ఈ చిత్రంలోని ఒక పాటకు శ్రీవసంత్ స్వరాలందించారు. ఈ చిత్రం ఆడియోను ఈ నెల 4న విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. ఇటీవల ఈ చిత్రం డిజిటల్ పోస్టర్‌ను ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స విడుదల చేసారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత అమ్మిరాజు కానుమల్లి మాట్లాడుతూ...‘అల్లరి నరేష్-కార్తీక ట్విన్స్ గా నటించిన ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాళీ' చిత్రంలో అల్లరి నరేష్ కామెడీతో పాటు...కార్తీక యాక్షన్ సీన్స్, డాన్స్ మూమెంట్స్ హైలెట్ గా నిలుస్తాయి. ఈ చిత్రం ఆడియో విడుదల వేడుకను ఈ నెల 4న హైదరాబాద్ లోని జె.ఆర్.సి.కన్వెన్షన్ సెంటర్ లో సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా నిర్వహించనున్నాం. ఆడియోతో పాటు సినిమా కూడా తప్పకుండా విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది' అన్నారు.


Click it and Unblock the Notifications











