అల్లరి నరేష్ ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాళీ’ ఫస్ట్ లుక్ (ఫోటోస్)
హైదరాబాద్: ఇ.వి.వి. సత్యనారాయణ సమర్పణలో సిరి పతాకంపై అమ్మిరాజు కానుమల్లి నిర్మిస్తున్న కామెడీ ఎంటర్ టైనర్ ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాళీ'. అల్లరి నరేష్-మోనాల్ గజ్జర్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో నరేష్ ట్విన్ సిస్టర్ గా ‘రంగం'ఫేం కార్తీక నటిస్తోంది. ‘వీడు తేడా'ఫేం బి.చిన్ని దర్శకుడు.
తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకకు అల్లరి నరేష్, భీమినేని శ్రీనివాసరావు తదితరులు హాజరయ్యారు. త్వరలో సినిమా విడుదల తేదీ ప్రకటించనున్నారు. స్లైడ్ షోలో సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు, ఫోటోలు...

షూటింగ్ పూర్తి
ఇటీవల అల్లరి నరేష్-మోనాల్ గజ్జర్ లపై రామోజీ ఫిలింసిటీలో చిత్రీకరించిన ‘ఐ లవ్ యూ అంటున్నా..'అనే పాటతో ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాళీ' షూటింగ్ పూర్తయింది.

నిర్మాత అమ్మిరాజు కానుమల్లి మాట్లాడుతూ..
‘బ్రదర్ ఆఫ్ బొమ్మాళీ' చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణానంతరం కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. సినీ అభిమానులు సెలక్ట్ చేసిన ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాళీ'టైటిల్ కు విశేషమైన ఆదరణ లభిస్తోందన్నారు.

అల్లరి నరేష్ కెరీర్లో..
అల్లరి నరేష్ కెరీర్ లో ఈ చిత్రం ఓ మైలురాయిగా నిలిచిపోతుంది. కామెడీతోపాటు కుటుంబ బాంధవ్యాలకు కూడా పెద్ద పీట వేస్తూ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాళీ'చిత్రాన్ని దర్శకుడు బి.చిన్ని చక్కగా తెరకెక్కించాడని నిర్మాత తెలిపారు.

అక్టోబర్లో విడుదల
ఈ చిత్రాన్ని అక్టోబర్ లో విడుదల చేసేందుకు సన్నాహలు చేస్తున్నారు.

నటీనటులు
హర్షవర్ధన్ రాణె, బ్రహ్మనందం, ఆలి, జయప్రకాష్ రెడ్డి, నాగినీడు, వెన్నెల కిషోర్, శ్రీనివాసరెడ్డి, అభిమన్యు సింగ్, కెల్లీ డార్జ్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న

తెర వెనక
ఈ చిత్రానికి సంగీతం: శేఖర్ చంద్ర, సాహిత్యం: భాస్కరభట్ల, ప్రెస్ రిలేషన్స్: వంశీ-శేఖర్, ఎడిటర్: గౌతంరాజు, పోరాటాలు: రామ్-లక్ష్మణ్, ఛాయాగ్రహణం: విజయ్ కుమార్ అడుసుమిల్లి

కథ, నిర్మాత, దర్శకత్వం
కధ: విక్రమ్ రాజ్, కార్యనిర్వహక నిర్మాత: వల్లూరిపల్లి వెంకటేశ్వర్రావు, నిర్మాత: అమ్మిరాజు కానుమల్లి, స్క్ర్రీన్ ప్లే-దర్శకత్వం: బి.చిన్ని


Click it and Unblock the Notifications











