Don't Miss!
- News పవన్ కళ్యాణ్‌ను మెచ్చుకున్న చంద్రబాబు
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
బ్రదర్స్: సూర్యకి.... కార్తి తెలుగు డబ్బింగ్
హైదరారాబాద్: తమిళ స్టార్ సూర్య హీరోగా రూపొందుతున్న 'మాట్రాన్' చిత్రం తెలుగులో 'బ్రదర్స్' పేరుతో రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో సూర్య డబల్ యాఓన్ చేస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన ఆ సక్తికర విషయం ఏమిటంటే....ఈ చిత్రంలో తొలిసారిగా సూర్య తన పాత్రకి తెలుగు డబ్బింగ్ చెబుతున్నారు. హరో ఆసక్తికర విషయం ఏమిటంటే సూర్య చేస్తున్న మరో పాత్రకి అతని తమ్మడు కార్తి డబ్బింగ్ చెబుతున్నాడు.
ఈ విషయమై ఇటీవల జరిగిన ఆడియో వేడకలో సూర్య మాట్లాడుతూ...ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు చిన్న గిఫ్ట్ ఇద్దామనే ఉద్దేశంతో నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పుకున్నాను. ఆద్యంతం ఆసక్తికరంగా పనిచేసిన సినిమా ఇది. శ్రమకి తగ్గ ఫలితం అందుతుందనే నమ్మకం ఉంది'' అని అన్నారు. కార్తీ మాట్లాడుతూ "మా అన్నయ్య చిత్రాల్లో ఇంకో బెంచ్ మార్క్ సినిమా అవుతుంది. నేను ఓ పాత్రకు డబ్బింగ్ చెప్పాను. అన్నయ్య యాక్షన్‌కు నేను డబ్బింగ్ చెప్పడం థ్రిల్‌గా అనిపించింది'' అని తెలిపారు.
సూర్య సియామీ ట్విన్స్ గా నటించిన సినిమా బ్రదర్స్. కె.వి.ఆనంద్ దర్శకుడు. తెలుగులో బెల్లంకొండ సురేష్ నిర్మాత. హ్యారిస్ సంగీతాన్ని సమకూర్చారు. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 1300 థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాజల్ నాయిక.
కోజాయిన్డ్ ట్విన్స్ గా ప్రియమణి నటించిన చారులత బాక్సాఫీస్ వద్ద తుస్సుమంది మరి భారీ వ్యయంతో తెరకెక్కిన సూర్య సినిమా ఏమవుతుందో చూడాలి. ఈ సినిమా కోసం సూర్య చాలా చాలా కష్టపడ్డారట. ఓ సందర్భంలో సూర్య పడే కష్టాన్ని చూసి వృత్తి పట్ల ఇంత అంకిత భావం పనికి రాదని జ్యోతిక మందలించారట. మరి ఫలితం ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.