twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హాట్ న్యూస్: రేపే 'బ్రూస్‌లీ' మొదటి షో

    By Srikanya
    |

    హైదరాబాద్‌: శ్రీను వైట్ల దర్శకత్వంలో రామ్‌చరణ్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌లు జంటగా నటించిన చిత్రం 'బ్రూస్‌లీ'. . డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై డి.వి.వి దానయ్య ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. థమన్‌ సంగీతం అందించారు. దసరా సందర్భంగా ఈ నెల 16న 'బ్రూస్‌లీ' ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపధ్యంలో చిత్రం ఫస్ట్ వరల్డ్ వైడ్ షో ఎక్కడ పడనుందంటే... రేపు హైదరాబాద్ ప్రసాద్స్ లో 7:45 PM లకు దేవనార్ స్కూల్ కు చెందిన విజువల్లీ ఛాలెంజెడ్ పిల్లలకు చూపించబడుతోంది.

    ఇక తాజాగా చిత్రం రిలీజ్‌ ట్రైలర్‌ విడుదలైంది. ఆ ట్రైలర్ ఇఫ్పుడు అందరి మన్ననలూ పొందుతోంది.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    చిరంజీవి గెస్ట్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి బిజినెస్ ఓ రేంజిలో జరుగుతోంది. ప్రీ రిలీజ్ బిజినెస్ ...56.45 కోట్ల వరకూ జరగటంతో ట్రేడ్ లో ఇదే చర్చనీయాంశంగా మారింది. నిర్మాతకు టేబుల్ ఫ్రాఫిట్స్ తెచ్చిపెడుతున్న ఈ చిత్రం.

    "వేట ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. మొదలుపెట్టాక, పూర్తయ్యేవరకూ రిక్వెస్ట్‌లు వినపడవ్! రియాక్షన్‌లు కనపడవ్! ఓన్లీ రీసౌండ్!" అంటూ చరణ్ చెప్తూ విడుదల చేసిన ఆయన తాజా చిత్రం డైలాగ్ టీజర్ కు అభిమానులకు పండగే చేసుకున్నారు.

    చిరంజీవి పాత్ర గురించి శ్రీను వైట్ల మాట్లాడుతూ... దాదాపు ఐదు నిమిషాల పాటు కనిపిస్తారు. ఆయన తెరపై కనిపించే విధానం ఒక పండగలా ఉంటుంది. అప్పటిదాకా చూసిన సినిమా ఒకెత్తు, ఆ ఐదు నిమిషాలు మరో ఎత్తు అన్నట్టుగా చిరంజీవి సందడి చేస్తారు. కథ రాసుకొన్నప్పుడే మేం చిరంజీవిగారితోనే ఆ పాత్ర చేయించాలనుకొన్నాం. సినిమాలో హీరో,హీరోయిన్స్ ని కాపాడే ఓ సన్నివేశం ఉంది. అందులోనే చిరంజీవి కనిపిస్తారు. మొదట ఓ పాటలోనూ చూపించాలనుకున్నా కుదర్లేదు అన్నాపు,

    Bruce Lee: 1st WW Show Tomorrow 7:45 PM at Prasads

    'రామ్‌చరణ్‌ లాంటి పెద్ద హీరోతో తొలిసారి నటించా. ఈ సినిమాలో చాలా గ్లామర్‌గా కనబడ్డానని అందరూ అంటున్నారు. నా లుక్‌ కోసం దర్శకుడు శ్రీనువైట్ల చాలా కష్టపడ్డారు. చరణ్‌తో డ్యాన్స్‌ చేయడం చాలా కష్టం. సాంగ్‌ షూటింగ్‌కు రెండు రోజుల ముందు నుంచే సాధన చేసేదాన్ని. ఈ విషయంలో చెర్రీ అన్ని విధాలా సహకరించేవాడు' అని రకుల్‌ప్రీత్‌ సింగ్‌ అన్నారు.

    తన తాజా చిత్రం 'బ్రూస్‌లీ'లో మెగాస్టార్‌ చిరంజీవితో కలిసి తెరను పంచుకోవడం చాలా ఆనందంగా ఉందని ఆ చిత్ర హీరోయిన్ రకుల్‌ప్రీత్‌ సింగ్‌ అన్నారు. నగరంలోని సినీమ్యాక్స్‌ బ్లూఫాక్స్‌లో జరిగిన కార్యక్రమంలో ఆమె మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా త్వరలో విడుదల కానున్న బ్రూస్‌లీ చిత్ర విశేషాలను మీడియాతో పంచుకున్నారు.

    నిర్మాత మాట్లాడుతూ ''బ్రూస్‌లీకి వీరాభిమాని అయిన ఓ యువకుడి కథ ఇది. తనకు ఎదురైన ఓ సమస్యపై ఎలా పోరాటం చేశాడన్నది తెరపైనే చూడాలి. వినోదం, కుటుంబ అనుబంధాలకు పెద్దపీట వేస్తూ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు. రామ్‌చరణ్‌ చేసే యాక్షన్‌, డ్యాన్సులు అభిమానుల్ని అలరించేలా ఉంటాయి. ఇటీవల విడుదలైన 'లే చలో...' పాటకి మంచి స్పందన లభిస్తోంది. చిత్రాన్ని 16న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాము'' అన్నారు.

    ఈ చిత్రానికి కథ: కోన వెంకట్‌, గోపీమోహన్‌, మాటలు: కోన వెంకట్‌, ఛాయాగ్రహణం: మనోజ్‌ పరమహంస, కూర్పు: ఎ.ఆర్‌. వర్మ, కళ: నారాయణరెడ్డి, ఫైట్స్‌: అణల్‌ అరసు, సమర్పణ: డి. పార్వతి, మూలకథ, స్క్రీప్లే, దర్శకత్వం: శ్రీను వైట్ల.

    English summary
    1st WW Show of ‪ ‎BruceLee TheFighter‬ for Devnar School's Visually Challenged Kids, Tomorrow 7:45 PM at Prasads, HYD. ‪
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X