రామ్ చరణ్ ‘బ్రూస్ లీ-2’ అప్డేట్స్...

By Bojja Kumar

హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘బ్రూస్ లీ' చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 16న విడుదలవుతోంది. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగు వెర్షన్ ఆడియో ఇటీవలే హైదరాబాద్ లో అభిమానుల సమక్షంలో గ్రాండ్ గా విడుదలైన సంగతి తెలిసిందే.

ఈ చిత్రాన్ని తమిళంలో ‘బ్రూస్ లీ-2' పేరుతో విడుదల చేస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా తమిళంలో ‘బ్రూస్ లీ' సినిమా ఆల్రెడీ సెట్స్ పై ఉండటంతో రామ్ చరణ్ నటిస్తున్న సినిమాకు ‘బ్రూస్ లీ-2' అని పేరు పెట్టారు. బ్రూస్ లీ -2 ఆడియో అక్టోబర్ 7న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాని భద్రఖాళీ ఫిల్మ్స్ తమిళంలో విడుదల చేస్తోంది.

'Bruce Lee 2' Tamil Audio launch from 7th October

ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి ఇప్పటికే రావాల్సినంత క్రేజ్ వచ్చేసింది. చిరంజీవి గెస్ట్ రోల్ లో కనిపించటం అనే వార్త, శ్రీను వైట్లతో తొలిసారి చేయటం, ఇప్పటికే వదిలిన ట్రైలర్స్ సినిమా బిజినెస్ హాట్ కేకుల్లా అమ్ముడుపోయేలా చేసాయి. దాంతో ఈ చిత్రం అన్ని ఏరియాలు అమ్ముడయ్యి...పదికోట్లు టేబుల్ ప్రాఫిట్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం.

రామ్‌చరణ్‌, రకుల్‌ప్రీత్‌లతో పాటు చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించిన నదియా, అరుణ్‌ విజయ్‌ నటిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై శ్రీనువైట్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కథ: కోన వెంకట్‌, గోపీమోహన్‌, మాటలు: కోన వెంకట్‌, ఛాయాగ్రహణం: మనోజ్‌ పరమహంస, కూర్పు: ఎ.ఆర్‌. వర్మ, కళ: నారాయణరెడ్డి, ఫైట్స్‌: అణల్‌ అరసు, సమర్పణ: డి. పార్వతి, మూలకథ, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీను వైట్ల.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X