రామ్‌చరణ్ 'బ్రూస్‌లీ': పోస్టర్స్ విడుదల (ఫొటోలు)
హైదరాబాద్: డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రామ్‌చరణ్, రకుల్‌ప్రీత్‌సింగ్ జంటగా నటిస్తున్న చిత్రం 'బ్రూస్‌లీ'. ఈ చిత్రం మొదటి పోస్టర్‌ను హీరో రామ్‌చరణ్ తన ఫేస్‌బుక్ ఖాతా ద్వారా సోమవారం విడుదల చేశారు. ఆ పోస్టర్స్ ని మీరు ఇక్కడ చూడవచ్చు.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
Another poster from #BruceLeeTheFighter !
Posted by Ram Charan on 21 September 2015
శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి డి.వి.వి దానయ్య నిర్మాత. థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. మరో పోస్టర్
Here it is... The first poster of #BruceLeeTheFighter.Keep following for more exclusives coming soon..
Posted by Ram Charan on 21 September 2015
రామ్ చరణ్, శ్రీను వైట్ల కాంబినేషన్ లో ‘బ్రూస్ లీ' టైటిల్ తో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సెట్స్ పైన రెగ్యులర్ షూటింగ్ లో ఉన్న ఈ చిత్రం ఆడియో ని అక్టోబర్ 16న విడుదల చేయటానికి నిర్ణయించినట్లు సమాచారం. ఈ ఆడియో ఫంక్షన్ ని ఘనంగా జరుపుతున్నారు. చిరంజీవి ఛీఫ్ గెస్ట్ గా రానున్నారు. అవకాసముంటే పవన్ కళ్యాణ్ కూడా వస్తారని అంటున్నారు.
ఈ సినిమాలో రామ్ చరణ్ తన చేతిపై బ్రూస్ లీ టాటూతో కనిపించనున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ పాత్ర గ్యాంగ్ లీడర్ లో చిరంజీవి తరహా పాత్ర అని రచయిత గోపీ మోహన్ చెప్తున్నారు.
"వేట ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. మొదలుపెట్టాక, పూర్తయ్యేవరకూ రిక్వెస్ట్‌లు వినపడవ్! రియాక్షన్‌లు కనపడవ్! ఓన్లీ రీసౌండ్!" అంటూ చరణ్ చెప్తూ విడుదల చేసిన ఆయన తాజా చిత్రం డైలాగ్ టీజర్ కు అభిమానులకు పండగే చేసుకున్నారు.

విడుదలైన మూడు రోజుల్లోనే 1 మిలియన్ (10 లక్షల) వ్యూస్ సాధించి చెర్రీ సినిమా టీజర్ యూట్యూబ్‌లో ముందుకు వెల్తోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన హీరోయిన్‌గా రకుల్ ప్రీత్ సింగ్ నటించారు. అక్టోబర్ 15న సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు నిర్మాత డీవీవీ దానయ్య ప్లాన్ చేస్తున్నారు.
నిర్మాతలు చెప్పేదాని ప్రకారం..."బ్రూస్ లీ ...ది ఫైటర్ చిత్రం అక్టబర్ 16న విడుదల అవుతుంది. అలాగే ఈ నెలాఖరున ఆడియోని విడుదల చేస్తారు !!". అలాగే ఈ చిత్రం రిలీజ్ డేట్ ని ఖరారు చేస్తూ నిర్మాతలు కొద్ది రోజుల క్రితంప్రకటన చేసారు. ఆ ప్రకటన ఇక్కడ చూడండి.
ఇందులో చిరంజీవి ఓ అతిథి పాత్రలో తళుక్కున మెరవబోతున్నారు. సినిమా నేపథ్యంలో సాగే కథ ఇది. చరణ్ ఫైట్ మాస్టర్ పాత్ర పోషిస్తున్నాడు. ఇందులో చిరు ఓ 'స్టార్' పాత్రలో కనిపించబోతున్నారని, ఆయన నటించే చిత్రానికి చరణ్ ఫైట్ మాస్టర్‌గా పనిచేసే సన్నివేశం ఒకటుందని తెలుస్తోంది. చిరు కనిపించేది కొద్దిసేపే అయినా ఈ కథకు ఆ సన్నివేశం కీలకం కానుందట.
ఇది వరకు 'మగధీర'లో చిరంజీవి, రామ్‌చరణ్‌లు కలసి సందడి చేశారు. ఆ తరవాత తెరపై ఇద్దరూ కలిసి కనిపించలేదు. మళ్లీ ఇన్నాళ్లకు చిరు, చరణ్‌ను ఒకే తెరపై చూసే అవకాశం అభిమానులకు దక్కుతోందని వారు ఆనందపడిపోతున్నారు.
రకుల్ ప్రీతి సింగ్ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రానికి ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. కోన వెంకట్, గోపీ మోహన్ కలిసి స్క్రిప్టు అందిస్తూండగా డివివి దానయ్య నిర్మిస్తున్నారు. డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఈ చిత్రం తెరకెక్కుతోంది.
దర్శకుడు మాట్లాడుతూ ''యాక్షన్‌తో కూడిన కుటుంబ కథా చిత్రమిది. భారీ తారాగణంతో పాటు, అత్యున్నత సాంకేతిక విలువలతో సినిమా తెరకెక్కిస్తాం'' అన్నారు.
నిర్మాత మాట్లాడుతూ ''విజయవంతమైన కలయికలో రూపొందుతున్న ఈ చిత్రం అందరినీ అలరించేలా ఉంటుంది. శ్రీనువైట్ల మూల కథ అందించారు. శ్రీను వైట్ల, రచయితలు కోన వెంకట్, గోపీమోహన్‌ది విజయవంతమైన కాంబినేషన్ అనీ, ఆ కాంబినేషన్‌తో ఈ సినిమా రూపొందుతుండటం ఆనందంగా ఉందని నిర్మాత దానయ్య అన్నారు.
ఈ చిత్రానికి కథ: కోన వెంకట్, గోపీమోహన్, మాటలు: కోన వెంకట్, ఛాయాగ్రహణం: మనోజ్ పరమహంస, కూర్పు: ఎ.ఆర్. వర్మ, కళ: నారాయణరెడ్డి, ఫైట్స్: అణల్ అరసు, సమర్పణ: డి. పార్వతి, మూలకథ, స్క్రీప్లే, దర్శకత్వం: శ్రీను వైట్ల.


Click it and Unblock the Notifications











